Switch to English

అల వైకుంఠపురములో నిర్మాతలు మోసం చేసారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి తన పేరిట లిఖించుకుంది. బాహుబలి 2 తప్ప చాలా రికార్డులు ఇప్పుడు ఈ చిత్రం పేరిటే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా వసూళ్లు, యూఎస్ లో 3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్మురేపింది అల వైకుంఠపురములో. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి కంటెంట్ ఎంత కారణమో, పబ్లిసిటీ విషయంలో అవలంబించిన దూకుడు కూడా అంతే కారణం.

సామజవరగమన అనే పాటను సినిమా రిలీజ్ కు నాలుగు నెలల ముందే వదిలి సాహసం చేసారు మేకర్స్. అయితే అది మంచి ఫలితాలనే అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమా పోస్టర్ పై అప్పట్లో “ఈ చిత్రం మీకు ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండదు” అనే క్యాప్షన్ విశేషంగా జనాలను ఆకర్షించింది.

డిజిటల్ విప్లవం మొదలయ్యాక ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ జనాలను ఆకర్షించడంలో ముందున్నాయి. ఏదైనా క్రేజీ సినిమా కనబడితే కొనేయడం నెల రోజులు పూర్తవ్వగానే తమ ఓటిటి ప్లాట్ ఫామ్ లో పెట్టేయడంతో థియేటర్లకు జనాలు రావడమే తగ్గిపోయింది. ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. దీనికి భిన్నంగా మీకు ఈ సినిమా ఈ రెండు ప్లాట్ ఫామ్స్ లో ఉండదు అనేసరికి జనాలకు ఇంప్రెషన్ మారిపోయింది. ఈ ఫ్యాక్టర్ కూడా ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలడానికి సహాయపడింది.

ఇంతవరకూ బానే ఉంది వ్యవహారం. కట్ చేస్తే ఈరోజు సన్ నెక్స్ట్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. అల వైకుంఠపురములో చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆశ్చర్యపోయారు జనాలు. మరి ఆ పోస్టర్ లో పెట్టింది జనాలను థియేటర్లకు రప్పించడం కోసమేనా? ఇది మోసమే కదా?

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

‘రఘురామ’ డ్యామేజీని.. రాపాకతో పూడ్చుతున్నారా.?

నర్సాపురం వైసీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ) ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో సొంత పార్టీ నేతల అత్యుత్సాహం.. పార్టీ కొంప ముంచిందన్నది నిర్వివాదాంశం. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై రఘురామకృష్ణరాజు...

సర్కారు వారి పాట : కీర్తి సురేష్‌ వ్యాఖ్యలు కొట్టి పారేసిన టీం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోతుంది. 14 రీల్స్‌ మరియు మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మహేష్‌ బాబు...

విషాదంలో మెగాస్టార్ చిరు.. దానికి కారణమేమిటంటే.?

మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ లాస్ కు గురయ్యారు. ఆయన కాలేజీ స్నేహితుడు కుటుంబంతో సహా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చిరంజీవిని తీవ్రంగా కలచివేసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలెంకు చెందిన...

మరోసారి డబల్ రోల్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న ఆచార్య చిత్రం కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి...

ముదురుతున్న దాసరి కుమారుల ఆస్తి వివాదం.. చిరు మద్యవర్థిత్వం వహించేనా?

తెలుగు సినీ దిగ్గజం, దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు మృతి చెందిన తర్వాత ఆయన తనయులు ప్రభు మరియు అరుణ్‌ లు ఆస్తి కోసం గొడవ పడుతున్న విషయం తెల్సిందే. ఇద్దరు...