Switch to English

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారాల్లోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ హైకోర్టు ఎప్పటికప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే వుంది. అలా మొట్టికాయ తగిలిన ప్రతిసారీ, ‘టీడీపీ కుట్ర..’ అనడం వైసీపీకి పరిపాటిగా మారిపోయింది. ‘చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో దిట్ట..’ అంటూ నెపం చంద్రబాబు మీద వేసేసి చేతులు దులుపుకుంటున్నారు వైసీపీ నేతలు. చిత్రంగా మంత్రులు కూడా ఇవే తరహా ‘సిల్లీ కామెంట్స్‌’ చేస్తున్నారు.

నిజానికి, న్యాయస్థానాల్లో విన్పించే వాదనల్ని బట్టి.. ఆ వాదనల్లో వాస్తవాన్ని బట్టి తీర్పులు వస్తుంటాయి. ప్రభుత్వం తరఫు వాదనల్లో పస లేకపోవడంతోనే ప్రతిసారీ న్యాయస్తానాల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నాయి. వైసీపీ జెండా రంగుల విషయానికొస్తే, న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా ప్రభుత్వంలో మార్పు రావడంలేదు.

అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలంటూ ప్రభుత్వం చేసిన పొలిటికల్‌ పబ్లిసిటీ స్టంట్‌కి కూడా ఇలాగే షాక్‌ తగిలింది. రాజధాని కోసం సేకరించిన భూముల్లోనే ఎందుకు.? వేరే ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొచ్చుకదా.? అన్నది లాజిక్‌తో కూడిన ప్రశ్నే. కానీ, ఆ లాజిక్‌ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తోంది. ఇక, ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ, సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు.. చంద్రబాబుని తూలనాడుతున్నారు.. కొందరైతే న్యాయస్థానాల మీదా అవాకులు చెవాకులు పేలడానికి వెనుకాడటంలేదు.

వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸, ఇటీవల న్యాయస్థానంపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారాన్ని పెట్టీ కేసుగా కొట్టి పారేశారాయన. ఏ కేసు ఎలాంటిదో హైకోర్టుకి ఓ ప్రజా ప్రతినిది¸.. పైగా అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పాఠాలు చెబుతాడా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం.

‘ప్రభుత్వం దగ్గర సరైన సలహాదారులు లేరు.. న్యాయస్థానంలో వాదనలు విన్పించాల్సిన విభాగం కూడా సమర్థవంతంగా పనిచేయడంలేదు.. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి పదే పదే మొట్టికాయలు పడటానికి ఇదీ ఓ కారణమే..’ అని ఓ రాజకీయ పరిశీలకుడు తన అభిప్రాయాన్ని ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో వెల్లడించడం గమనార్హం. మొత్తమ్మీద, తమ వైఫల్యాలను గుర్తెరగకుండా.. వైసీపీ శ్రేణులు.. టీడీపీకి పరోక్షంగా క్రెడిట్ ఇచ్చి, వారిని టార్గెట్ చేస్తుండడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.!

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ‘పాత పథకాలకు కొత్త పేర్లు’ అయితే, ఇంకొన్ని నిజంగానే కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఆయా...

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభన మామూలుగా లేదు. మొన్నటి వరకు సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు వైరస్‌ దూరంగా ఉందనుకుంటున్న సమయంలో ఇప్పుడు వారికి కూడా పాజిటివ్‌ నిర్థారణ అవుతోంది. ఏపీలో ఇప్పటికే...

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

ఎక్కువ చదివినవి

కరోనా అంటించారని పెళ్లి పెద్దకు రూ. 6 లక్షల జరిమానా

దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న కారణంగా వేడుకలు పండుగలను ప్రభుత్వం నిషేదించింది. పెళ్లికి 30 నుండి 50 మందిని మాత్రమే అనుమతిస్తుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో అసలు...

ఇన్‌సైడ్‌ స్టోరీ: అప్పుల కుప్పగా మారుతోన్న ఆంధ్రప్రదేశ్‌.!

ఆంధ్రప్రదేశ్‌కి ఒకప్పుడు ‘అన్నపూర్ణ’ అనే గుర్తింపు వుండేది. కానీ, ఇకపై ‘అప్పుల కుప్ప’ అనాలేమో.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు...

రంగుల పంచాయితీపై వెనక్కు తగ్గిన జగన్‌ ప్రభుత్వం

గ్రామాల్లో పంచాయితీ ఆఫీస్‌లు మరియు పలు ప్రభుత్వ రంగ ఆఫీస్‌లకు ప్రభుత్వం వైకాపా రంగును వేయించడంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఆ రంగును తొలగించేందుకు వైకాపా సొంత నిధులు పెట్టుకోవాలని ప్రభుత్వం నిధులు...

చెస్ట్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. కరోనాతో రోగి మృతి.. వీడియో వైరల్

హైదరాబాద్ లో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రోగుల కోసం హైదరాబాద్ లో ప్రభుత్వం సూచించిన ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా లేవంటూ ఇటివల ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే....

మరోసారి డబల్ రోల్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న ఆచార్య చిత్రం కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి...