ఓ ముతక సామెత వుంది.. డబ్బులిచ్చి గుద్దించుకోవడం అని.! వైసీపీ పరిస్థితి ఇప్పుడలానే వుంది.! నాలుగేళ్ళుగా వైసీపీ, ఓ వర్గం మీడియాని పెంచి పోషిస్తోంది. అంతకన్నా ఎక్కువ కాలంగానే, ఓ వర్గం మీడియాని వైసీపీ ప్రోత్సహిస్తున్నా, గడచిన నాలుగేళ్ళలో ఆర్థికంగా ఆయా మీడియా సంస్థలకు మరింత వెన్ను దన్నుగా వుంటూ వస్తోంది.
అలాంటి చాలా మీడియా సంస్థలు గడచిన నాలుగేళ్ళుగా ఆర్థికంగా పుంజుకున్నాయి కూడా. ప్రభుత్వ ప్రకటనల రూపంలో సదరు మీడియా పండగ చేసుకుంది. ‘మంది సొమ్ము’ని ఫుల్లుగా మేసి, ఇప్పుడు యజమానికే టోకరా ఇచ్చేలా కనిపిస్తోంది.
వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏమో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తే.. ఈ ఏడాదిలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు కూడా. ఇలాంటి సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు రావడమేంటి.?
అంతా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావమే. టీడీపీ పుంజుకుంటోంది. ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. ఓటేసేసినోళ్ళంతా వైసీపీ ఎమ్మెల్యేలే. వారిని వైసీపీ తాజాగా సస్పెండ్ చేసింది కూడా.!
అంతకు ముందు.. చాలాకాలం క్రితమే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకారనుకోండి.. అది వేరే సంగతి. ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే, గ్రాడ్యుయేట్లు రాష్ట్రంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు వైసీపీకి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలోనే ‘పచ్చగాలి వీస్తోంది’ అంటూ వైసీపీ అనుకూల మీడియా కూడా ఒప్పుకోక తప్పడంలేదు.
‘అదేంటి.? మనం పెంచి పోషించిన మీడియా మనకి వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది.?’ అంటూ వైసీపీ అధినాయకత్వం గుస్సా అవుతోంది. అంటే, ఇన్నాళ్ళూ వృధాగా ఖర్చు చేశామా.? ఇదంతా వృధా ప్రయాసేనా.? అని సదరు మీడియాని నమ్ముకున్న వైసీపీ ఆందోళన చెందడంలో వింతేముంది.?
590879 40851Hello! I simply would like to give a huge thumbs up for the excellent information youve here on this post. I may be coming back to your weblog for much more soon. 356636