Switch to English

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ, అధికార పార్టీ ఇంకోలా అభివర్ణిస్తోంది. చంద్రబాబుకి వినతి పత్రం అందించేందుకే వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిథి ప్రయత్నించారట. చంద్రబాబు ఏమన్నాముఖ్యమంత్రి పదవిలో వున్నారా.. ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి మీద గుస్సా అవుతూ, చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం వైసీపీ ప్రజా ప్రతినిథి చేశాడన్నది వైసీపీ వెర్షన్. ముఖ్యమంత్రి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు టీడీపీ నేత చేస్తే, ఆయన మీద కేసులు పెట్టే అవకాశం అధికార పార్టీకి వుంది. అంతకు మించిన బండ బూతులు వైసీపీ నేతలు, సదరు టీడీపీ నేతని తిట్టేశారనుకోండి.. అది వేరే సంగతి. అలాంటప్పుడు, వినతిపత్రం.. అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది.?

‘అది వినతి పత్రం ఇచ్చేందుకు జరిగిన ప్రయత్నం మాత్రమే.. అది దాడి కాదు, దండయాత్ర అసలే కాదు..’ అంటూ పోలీస్ ఉన్నతాధికారులూ వివరణ ఇచ్చారు. వైసీపీ వాదనా, పోలీసుల వాదన ఒకేలా ఎలా వుంది.? అంటే, పోలీసులు పూర్తిగా వైసీపీ వెర్షన్‌ని వినిపిస్తున్నారని అనుకోవాలేమో.

ప్రతిపక్ష నేతకు వినతిపత్రం ఇవ్వడానికి పదుల సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని అధికార పక్షానికి చెందిన నేత వెళ్ళడమా.? దీన్ని దండయాత్ర అని కాక ఇంకేమనాలి.? ప్రతిపక్ష నేత చంద్రబాబుగానీ, విపక్షాలకు చెందిన ఇంకెవరైనా నేతలుగానీ, పెద్ద మొత్తంలో అనుచరుల్ని వెంటేసుకుని, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తామంటే, పోలీసులు.. అనుమతిస్తారా.? అక్కడ గలాటా జరిగితే, దాన్ని కూడా ‘దాడి కాదు, దండయాత్ర కాదు..’ అని అనగలరా.? అసలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకిలా మాటలు ట్విస్ట్ అవుతున్నాయి.? ప్రభుత్వంలో వున్నవారు, ప్రభుత్వ వ్యవస్థల్ని నడుపుతున్నవారు, అధికారులు కూడా ఈ ‘ట్విస్టింగ్’ మాటలు ఎలా చెప్పగలుగుతున్నారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

గతంలో తమిళనాడు రాజకీయాల్లో కక్ష సాధింపుల గురించి విన్నాం.. ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయ్.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ కక్ష సాధింపు చర్యలకు ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. వచ్చే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తామనీ, ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని టీడీపీ హెచ్చరిస్తున్న దరిమిలా.. రాష్ట్రం ఇప్పట్లో బాగుపడే అవకాశాలైతే లేవన్నది నిర్వివాదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ మనసులో మాట ఇదే..!!

వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో చేయాల్సినవ పనులు చాలా ఉన్నాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్...

స్పిరిట్ లో ప్రభాస్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ప్రభాస్ ప్రస్తతం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే...

యాదాద్రీశుడిని దర్శించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు..!

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని...

డ్రగ్స్ అలా.. గంజాయి ఇలా.. ఎవరిది ఈ పాపం.?

పొరుగు రాష్ర్టాల నుంచి మధ్యం బాటిళ్లు అక్రమ మార్గాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కానీ, తనిఖీల కళ్లు కప్పి పొరుగురాష్ట్రల నుంచి మధ్యం యధేచ్చగా రాష్ట్రంలోకి...

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...