Switch to English

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే వుంది. అది 60 – 40 వ్యవహారం. ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితమైన తెరవెనుక బాగోతం కాదు.. ఆయా రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే మీడియా సంస్థలకీ పాకిన బాగోతం.

యధా పచ్చ పార్టీ, తథా పచ్చ మీడియా. యధా బులుగు పార్టీ.. తథా బులుగు మీడియా. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణానికి సంబంధించి మొట్టమొదటి బ్రేకింగ్ సదరు ‘దమ్మున్న ఛానెల్’ నుంచే వచ్చింది. ‘తూచ్, అదంతా ఉత్తదే..’ అని బులుగు పార్టీ కథలు వినిపించింది. బులుగు మీడియా కూడా, ‘దమ్మున్న ఛానెల్’ మీద మండిపడింది. కానీ, దమ్మున్న పచ్చ ఛానెల్ చెప్పిందే నిజమయ్యింది.

బులుగు పార్టీ కోసం గతంలో పనిచేసిన వైఎస్ షర్మిల, తెలంగాణలో పార్టీ పెడుతూ, దమ్మున్న పచ్చ ఛానెల్ సాయం కోరినట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చ పార్టీని ఎలాగైతే సదరు దమ్మున్న ఛానెల్ మోస్తోందో, అదే స్థాయిలో తెలంగాణలో బులుగు పార్టీ (కాస్త రంగు మారిన బులుగు పార్టీ.. అదేనండీ షర్మిల పార్టీ) పైన శ్రద్ధ పెడుతోంది. నిఖార్సయిన 60 – 40 సంబంధం అంటే ఇదే మరి. ఈమాత్రం దానికి పచ్చ మీడియా, బులుగు మీడియా మధ్య రాజకీయ వైరం వుందనే ప్రచారం ఎందుకు.?

ఎందుకేమిటి.? అటు పచ్చ కార్మికులు, ఇటు బులుగు కార్మికులు దాన్ని గుడ్డిగా నమ్మేసి.. సదరు మీడియా సంస్థకీ, సదరు రాజకీయ పార్టీకీ బానిసల్లా బతికేయాలి కదా.? మీడియా ఏం చెబితే అదే జనం నమ్మాలనే భావన రాజకీయ పార్టీలో పెరిగిపోవడం వల్లే, రాజకీయ పార్టీలు.. మీడియా సంస్థల్ని లోబరచుకున్నాయి.

అదే సమయంలో, తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలకు ఏనాడో మీడియా సంస్థలు అమ్ముడుపోయాయి. విలువల్లేవ్.. వంకాయల్లేవ్.. అసలు జర్నలిజం ఎథిక్స్ అనేవే లేవు. పాత్రికేయ వ్యభిచారం.. అని ఇలాంటి సందర్భాల్లోనే అనాల్సి వస్తోందని ప్రజాస్వామ్యవాదులు, మీడియా విలువల గురించి ఆలోచించే సీనియర్ పాత్రికేయులూ వాపోతున్నారు.

ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారలో వుండాలి.. ఆ రెండు రంగుల్లో ఏదో ఒకటి మాత్రమే కనిపించాలి.. అంతే తప్ప, ఇంకొకరు కొత్తగా రాజకీయాల్లోకి రాకూడదు.. అసలు రంగు ఏమిటో ప్రజలకు కనిపించకూడదు. ఇదీ బులుగు పచ్చ కామెర్ల 60 – 40 పొలిటికల్ మీడియా కక్కుర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ.. ఏదీ లేదన్న ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కుంపటి పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ చాలా తేలిగ్గా స్పందించారు. సెటైరికల్ కామెంట్లు చేశారు. ఆత్మ లేదు.....

బిగ్ బిగ్ 5: టాస్క్ లో ఎన్నీ మాస్టర్ ఎందుకంత హైపర్?- ఎపిసోడ్ 38

బిగ్ బాస్ 5 నామినేషన్స్ వేడి ఈరోజు ఎపిసోడ్ లో కొనసాగింది. ఎవరు ఎవరి మీద ఎందుకు వేసుకున్నారో అని గ్రూపులుగా మారిపోయి డిస్కషన్స్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ అన్న న్యూటన్...

క్రికెటర్ యూవీ అరెస్ట్‌

టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశాడు. గతంలో ఆయన టీం ఇండియా ఆటగాడు యజువేంద్ర చహాల్‌ ను కులం పేరుతో దూషించడం జరిగిందట. ఆయన చేసిన...

అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ రివ్యూ

అక్కినేని అఖిల్‌ మూడు సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా ఈయనకు హిట్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ...