Switch to English

వైఎస్‌ జగన్‌ని పవన్‌ మెచ్చుకున్నా.. ఒప్పుకోవట్లేదెందుకో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘ఎట్టకేలకు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గుర్తించారు..’ అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. అలాంటిది, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎందుకు జగన్‌ని ముఖ్యమంత్రిగా గుర్తించరు.? ఛాన్సే లేదు. ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడితే, జగన్‌ ప్రభుత్వం స్పందించాలని పవన్‌ కళ్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌ చేశారు. దానర్థం, జగన్‌ని ముఖ్యమంత్రిగా పవన్‌ గుర్తించినట్లే కదా.!

ఇంకా చాలా విషయాల్లోనూ పవన్‌, ‘ముఖ్యమంత్రిగారూ..’ అని సంబోదిస్తూనే వచ్చారు. కానీ, వైసీపీ శ్రేణులకి మాత్రం ‘జగన్‌ రెడ్డిగారూ..’ అన్న ప్రస్తావన మాత్రమే విన్పించింది, కన్పించింది. ఇక, తాజాగా సుగాలి ప్రీతి కేసు విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎట్టకేలకు స్పందించడం పట్ల పవన్‌ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. కానీ, వైసీపీ శ్రేణులకి ఇది కూడా నచ్చడంలేదు. ఇంకా ‘ప్యాకేజీ కళ్యాణ్‌’ అనీ, ఇంకోటనీ.. పవన్‌ కళ్యాణ్‌ మీద సెటైర్లు, జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తూనే వున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ని తిడితే, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందా.? సుగాలి ప్రీతి కేసులోనే కాదు, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించాల్సి వుంది. ఇవి మాత్రమే కాదు, వైఎస్‌ జగన్‌పై గతంలో విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం (కోడి కత్తి కేసుగా ప్రాచుర్యం పొందింది) కేసులోనూ సీబీఐ విచారణ జరిగి తీరాల్సిందే. ముఖ్యమంత్రి అయ్యాక, ఎనిమిదిన్నర నెలల పాటు, సుగాలి ప్రీతి కేసుపై పెదవి విప్పని వైఎస్‌ జగన్‌, ఎప్పుడైతే కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి కోరిక మేరకు ‘జస్టిస్‌ ఫర్‌ సుగాలి ప్రీతి’ అంటూ ర్యాలీ చేశారో, ఆ తర్వాతే స్పందించారన్నది జగమెరిగిన సత్యం.

చంద్రబాబు హయాంలో ఆ ఘటన జరిగితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికేంటి సంబంధం.? అని కొందరు అజ్ఞానులైన వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. కానీ, పవన్‌ ఒత్తిడి పనిచేసింది, వైఎస్‌ జగన్‌ దిగొచ్చారు. క్రెడిట్‌ పవన్‌ కళ్యాణ్‌కి ఇచ్చినా ఇవ్వకున్నా, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...