ఇండియన్ 2 సెట్స్ లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఈపాటికే అందరికీ తెలిసి ఉంటుంది. చెన్నై శివార్లలో షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రేన్ అనుకోకుండా కూలిపోవడం వల్ల ముగ్గురు చనిపోయిన విషయం తెల్సిందే. అందులో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ కాగా మరో ఇద్దరు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు కాకుండా దాదాపు మరో 10 మంది దాకా గాయపడినట్లు, వారికి ప్రస్తుతం చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
అయితే ఇప్పుడు ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. అమ్రితారామం అనే ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఈ సంఘటన గురించి వివరించే ప్రయత్నం చేసింది. “ఈ దారుణమైన సంఘటన నుండి తృటిలో తప్పించుకున్నాం. 10 సెకెన్ల గ్యాప్ అంతే. నేను, కమల్ సర్, కాజల్ అప్పుడే కొంచెం ముందుకు కదిలాం. అప్పటిదాకా దాని కిందనే ఉన్నాం. మేము క్షేమంగానే ఉన్నాం. అయితే మా బృందంలో ముగ్గురు చనిపోవడం దురదృష్టకరం” అని సోషల్ మీడియాలో స్పందించింది.
దీని గురించి విన్న కమల్, కాజల్ ఫ్యాన్స్ అమ్మో ఇంతలో ఎంత ప్రమాదం ఇద్దరికీ తప్పింది అనుకుంటున్నారు. పై ట్వీట్ కు కాజల్ కూడా బాధపడుతున్నట్లు ఒక ఎమోజి పెట్టింది. ప్రస్తుతం ఈ దురదృష్టకర సంఘటన కోలీవుడ్ లో తీవ్ర కలకలం రేపుతోంది.
Providential escape from the ghastly mishap .Literally 10secs away from being crushed under.fortunate Kamal sir ,Kajal n me who were right under are safe #count your blessings our crushed canopy under the crane . we are #safe RIP our fellow mates @ikamalhaasan @MsKajalAggarwal pic.twitter.com/LB8SUwZV3l
— amritharam (@amritharam2) February 19, 2020
358595 864786Oh my goodness! an incredible article dude. Thanks a ton Nevertheless We are experiencing problem with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person obtaining identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 264744
624767 983279Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 707147