Switch to English

పవన్ కళ్యాణ్ జీరోనా.? మరి, హీరోని చేస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే వుంటాయ్.. అంటారు తల పండిన రాజకీయ వేత్తలు.! ఒకర్ని ఇంకొకరు ఓడించడం కాదు, బలమైన నాయకత్వం కూడా ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలతో తమ ఓటమిని కొనితెచ్చుకుంటుంది. అదే రాజకీయం అంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సంఖ్యా బలం పరంగా చూసుకుటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు. ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులున్నారు. ఇతర పార్టీల నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలు అదనం. అయినాగానీ, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కోసం కిరాయి ఓటర్లను ఎందుకు అరువు తెచ్చుకున్నట్టు.?

సరే, జనసేన పార్టీ అధినేత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.. ఇది కాదనలేని వాస్తవం. అలా పవన్ కళ్యాణ్‌ని ‘జీరో’ అని సంబోదించడం అధికార పార్టీకి అలవాటైపోయింది. మరి, ఆ ‘జీరో’ మీద పదే పదే ముఖ్యమంత్రి దగ్గర్నుంచి, వైసీపీలో ముఖ్య నేతలంతా ఎందుకు నోరు పారేసుకుంటున్నట్లు.?

దత్త పుత్రుడని ఒకరు, ఇంకో రకంగా విమర్శలు చేస్తూ మరికొందరు.. క్రమక్రమంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాపులారిటీ పెంచుకుంటూ వెళుతున్నారు రాజకీయంగా. ఎలాగోలా టీడీపీ, జనసేన కలిసిపోవాలన్న కక్కుర్తి మాత్రం వైసీపీ నేతలకు ఎక్కువగా కనిపిస్తోంది.

ముందే చెప్పుకున్నాం కదా, రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే వుంటాయని. తమ వినాశనం కోసం తామే ఆయుధాన్ని తయారుచేసుకుంటున్నట్టుంది వైసీపీ తీరు.

‘ఔను కదా, పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు.. ఆయన్ని జీరో అంటున్నారు.. మరెందుకు ఆయన్ని హీరోగా చేస్తున్నట్లు.? పవన్ కళ్యాణ్ విషయంలో అంత భయం లేకపోతే, ముఖ్యమంత్రి దగ్గర్నుంచి మంత్రుల వరకు.. ఎందుకిలా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి, రాజకీయంగా పబ్లిసిటీ పొందాలని కక్కుర్తి పడతారు.?’ అన్న చర్చ సహజంగానే జనాల్లో జరుగుతోంది, జనసేనాని పట్ల సింపతీ పెరుగుతోంది.

ఆ రకంగా చూస్తే, జనసేన పార్టీకి వైసీపీనే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోందటన్నమాట. కోట్లు ఖర్చు చేస్తే మాత్రం ఈ పబ్లిసిటీ వస్తుందా.? ఛాన్సే లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....