బ్లాక్ టిక్కెట్ల ద్వారా వచ్చే సొమ్ముల్ని హీరోలు తమ జేబుల్లో వేసుకుంటారట. ఓ మంత్రిగారి అవగాహనా రాహిత్యానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అయినా, సినిమా టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సింది స్థానిక పోలీసులు. పెద్ద సినిమాలకు టిక్కెట్ ధరలు పెంచుకోవడం అనేది, ప్రభుత్వం.. ఆయా నిర్మాతలకి కల్పించే వెసులుబాటు మాత్రమే.
సినిమా మార్కెట్ పెరిగితే.. ఆ సినిమా క్వాలిటీ పెరుగుతుందన్న సూత్రాన్ని ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ పాటిస్తోంది.. ఈ క్రమంలోనే తెలుగు సినిమా స్థాయి, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయి వైపు పరుగులు పెడుతోంది. కేవలం ‘వకీల్ సాబ్’ అనే సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటించింది కావడం, ఆ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కావడంతోనే వచ్చిన సమస్య ఇది. ఖచ్చితమైన రాజకీయ కుట్రతో ‘వకీల్ సాబ్’ సినిమాని అధికార పార్టీ దెబ్బకొట్టింది. కానీ, ఆ దెబ్బ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తగులుతుందా.? ఛాన్సే లేదు.
ఓ మంత్రిగారు నిన్న ఆవేశంతో ఓ రాజకీయ బహిరంగ సభలో, ‘వకీల్ సాబ్’ సినిమా మీద విమర్శలు చేస్తూ, బ్లాక్ టిక్కెట్ల వ్యవహారం గురించి వీరావేశానికి గురయ్యారు. సదరు మంత్రిగారి మీదనే బెట్టింగ్ ఆరోపణలున్నాయి. ఇంకో మంత్రిగారి మీద పేకాట క్లబ్బుల నిర్వహిస్తాడనే ఆరోపణలున్నాయి. ‘అరెస్టు చేస్తే, పేకాట మానేస్తారా.? జరీమానా కడతారు, మళ్ళీ ఆడతారు.. వారిని ఉరి తీసెయ్యరు కదా.?’ అంటూ చిత్రంగా ప్రశ్నించాడో మంత్రి.
ఓ ఎమ్మెల్యే అయితే అక్రమంగా నడుస్తోన్న తన అనుచరుల ఇసుక లారీల్ని ఓ పోలీస్ అధికారి ఆపాడన్న కారణంగా, అతని మీద తిట్ల దండకాన్ని అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయి రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు. అవన్నీ వందల కోట్లు, వేల కోట్ల దోపిడీ వ్యవహారం. సినిమా అనేది చాలా చాలా చిన్న వ్యవహారం. ఎవర్ని మభ్యపెట్టడానికీ ‘వకీల్ సాబ్’ గొడవ.? ఏమో, అధికార పార్టీకే తెలియాలి. వైసీపీ కార్యకర్తలు కూడా ఈ రచ్చని భరించలేకపోతున్నారు, జగన్ మోహన్ రెడ్డికి చెడ్డపేరు తెస్తున్నారంటూ వైసీపీ నేతల మీదే కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న పరిస్థితి.
252233 827128Hi, you used to write exceptional posts, but the last several posts have been kinda boring I miss your excellent posts. Past couple of posts are just slightly bit out of track! 960732
567393 325805Basically a smiling visitant here to share the enjoy (:, btw outstanding pattern . 615144
932525 546977so a lot wonderful info on here, : D. 829855
278039 871104I really appreciate your piece of work, Wonderful post. 129620
139531 547583For anybody who is interested in enviromentally friendly points, might possibly surprise for you the crooks to keep in mind that and earn under a holder simply because kind dissolved acquire various liters to important oil to make. every day deal livingsocial discount baltimore washington 866321