Switch to English

నారా లోకేష్ హీరోయిజం.. ‘ఎలివేషన్స్’ చేస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ప్రజా సమస్యలపై తనదైన స్టయిల్లో గళం విప్పుతున్నారు. ప్రజల తరఫున నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదాయన. సరే, లోకేష్ మాటల్ని జనం విశ్వసిస్తారా.? టీడీపీకి ఆయన వల్ల లాభమెంత.? అన్నది వేరే చర్చ.

నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా టీడీపీ కార్యకర్తలు హంగామా చేయడంలో వింతేమీ లేదు. కానీ, చిత్రంగా నారా లోకేష్‌కి ఎలివేషన్ ఇచ్చేందుకోసం అధికార వైసీపీ నానా పాట్లూ పడుతోంది. కొద్ది రోజుల క్రితం.. అదీ స్వాంత్ర్య దినోత్సవం రోజున, గుంటూరులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ వెళ్ళారు. అంతే, అక్కడికి ‘బులుగు మూకలు’ దూసుకొచ్చేశాయి. ఇంకేముంది.? పచ్చ దండుకీ, బులుగు మూకకీ మధ్య నానా యాగీ చోటు చేసుకుంది.

బులుగు మూకలు అక్కడికెందుకు వెళ్ళాయి.? అన్నదానిపై ఆరా తీయాల్సిన పోలీసు యంత్రాంగం, నారా లోకేష్‌ని అరెస్టు చేసి.. ఎక్కడెక్కడో తిప్పి.. హైడ్రామా క్రియేట్ చేయడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. పోలీసులు శాంతిభద్రతలు కాపాడేందుకోసం పనిచేస్తారు. లోకేష్ రాకతో, యాగీ జరుగుతుంది గనుక, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారనే అనుకుందాం. మరి, వైసీపీ మూకల్ని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదన్న ప్రశ్న తెరపైకొస్తుంది.

ఆ హౌస్ అరెస్టులేవో వైసీపీ మూకల విషయంలో ప్రయోగించి వుంటే, అసలు సమస్యే వచ్చేది కాదు. ఇప్పుడు తాజాగా ఇంకోసారి గుం‘టూరు’ వెళుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట పర్యటనకు లోకేష్ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగానే అల్టిమేటం జారీ చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని హెచ్చరించేశారు పోలీసు అధికారులు. ఓ రాజకీయ నాయకుడు, పైగా ప్రతిపక్షానికి చెందిన నాయకుడు, ఓ ప్రజా ప్రతినిథి.. పోలీసుల అనుమతి తీసుకుని, ప్రజల వద్దకు వెళతారా.? రాష్ట్రంలో ప్రజా ప్రతినిథులంతా అలానే చేస్తున్నారా.?

లోకేష్ విషయంలో ప్రభుత్వ పెద్దలు చూపుతున్న అత్యుత్సాహమే ఆయనకి డబుల్ ఎలివేషన్ దక్కేలా చేస్తోంది రాజకీయంగా. చూస్తోంటే, ఇదంతా లోకేష్ మీద రాజకీయ కక్ష కాదు, లోకేష్ మీద అమితమైన ప్రేమ.. అని అనుకోవాలేమో.! ప్రభుత్వం ఇంతలా లోకేష్ విషయంలో కఠినంగా వ్యవహరించి వుండకపోతే.. లోకేష్ గురించి అంతలా జనంకూడా పట్టించుకునే పరిస్థితి వుండకపోవచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...