Switch to English

వైసీపీ మార్కు ‘జయహో బీసీ’.! ఇంతకీ ఆ బీసీలెక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సకల శాఖా మంత్రి అనే ట్యాగ్ దక్కించుకున్నది సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉత్తరాంధ్రపై రాజకీయ పెత్తనం చేస్తున్నది విజయసాయిరెడ్డి.. వైసీపీకి సంబంధించినంతవరకు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ ఎటు చూసినా ‘రెడ్డి’ సామాజిక వర్గానిదే పెత్తనం. సలహాదారుల లిస్టు తీస్తే అందులోనూ ‘పెద్ద వాటా’ రెడ్డి సామాజిక వర్గానిదే.

అయినాగానీ, వైసీపీ ‘జయహో బీసీ మహాసభ’ అంటోంది. మొన్నామధ్య వైసీపీ కాపు సామాజిక వర్గ ప్రజా ప్రతినిథులంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.. ఇంతకీ, వైసీపీలో వున్న పెద్ద కాపు నాయకుడెవరు.? ఆయన వల్ల కాపు సామాజిక వర్గానికి ఒరిగిందేంటి.? అన్న ప్రశ్న తెరపైకొస్తో ‘నో ఆన్సర్’.!

వైసీపీ హయాంలో బీసీలకు పెద్ద పీట వేశామనీ, బీసీలంటే బ్యాక్ బోన్ అని నిరూపించామనీ వైసీపీ చెప్పుకుంటోంది. ఏదీ ఎక్కడ.? టీటీడీ ఛైర్మన్‌గిరీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వగలరా.? ‘సకల శాఖ మంత్రి’ అనే ట్యాగ్ కలిగిన సలహాదారు పోస్టులో బీసీ సామాజిక వర్గ ప్రముఖుల్ని నియమించగలరా.? అంతెందుకు, సలహాదారుల్లోనూ అగ్ర భాగం బీసీలకు ఇచ్చే పరిస్థితి వుందా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

విజయవాడ వేదికగా వైసీపీ సయహో బీసీ.. అంటూ మహాసభ నిర్వహిస్తోంది. సుమారు 84 వేల మంది బీసీ ప్రజా ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారట. హాజరై ఏం తీర్మానిస్తారు.? వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని అనగలరా.? బీసీ నాయకుడికి పార్టీ పగ్గాలు దక్కుతాయని చెప్పగలరా.? ఛాన్సే లేదు.

బీసీ మహా సభలో ‘జయహో జగనన్న’ కీర్తనలు తప్ప ఇంకేమీ వుండబోవు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈమాత్రందానికి ‘జయహో బీసీ మహాసభ’ పేరుతో హంగామా దేనికి.? ఇదో పబ్లిసిటీ స్టంట్. ఏ సమావేశమైనా వైసీపీ పెట్టుకోనీ.. అధినేత జగన్ మోహన్ రెడ్డి కీర్తనలతో ఆయా సభలు మార్మోగిపోవాల్సిందే. ఇప్పుడూ అదే జరుగనుంది. ఎనీ డౌట్స్.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...