Switch to English

జర్నలిస్టులతో ఆడుకంటున్న వైసీపీ, టీడీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘బాబూ, నీది ఏ ఛానల్.? ఏ పత్రిక.?’ అంటూ అడిగి మరీ జర్నలిస్టులతో ఆడుకుంటున్నాయి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ఆయా మీడియా సంస్థలపై అక్కసు వెల్లగక్కే క్రమంలో, ఆయా పత్రికలు లేదా ఛానళ్ళకు చెందిన జర్నలిస్టుల్ని రాజకీయ నాయకులు ర్యాగింగ్ చేస్తున్న వైనం అత్యంత హేయం. ఇదంతా చూస్తూ, నిశ్చేష్టులుగా మిగిలిపోతున్నారు మిగతా జర్నలిస్టులు. జర్నలిస్టు సంఘాలు ఏమైపోయాయ్.? మొత్తంగా పాత్రికేయ వ్యవస్థ ఏమైపోయింది.?

మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వస్తే, ‘మీది ఏ ఛానల్.? ఏ పత్రిక.?’ అని ప్రశ్నించి, ఆయా మీడియా సంస్థల ప్రతినిథులకు వేర్వేరు సమాధానాలు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇస్తుంటారు. మీరు ప్రశ్నలడుగుతారా.? ఉపన్యాసాలు ఇస్తారా.? అంటూ ఈనాడుకి సంబంధించిన ఓ జర్నలిస్టులు మీద ఇటీవల మంత్రి అంబటి రాంబాబు సెటైర్లేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సాక్షి విలేకరితో ఆడుకున్నారు. ‘లైవ్ పెడుతున్నావా.? నీ ఉద్యోగం ఊడిపోతుందేమో..’ అంటూ జదరు జర్నలిస్టుని ర్యాగింగ్ చేశారు. నిజానికి, ఇలాంటి సందర్భాల్లో సాటి జర్నలిస్టుకి అండగా నిలవాల్సిన మిగతా జర్నలిస్టులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.

‘బాబ్బాబూ.. మా న్యూస్ కవర్ చేయండి..’ అంటూ ఒకప్పడు రాజకీయ నాయకులు, మీడియాని దేబిరించేవారు. ఇప్పుడేమో, పరిస్థితి రివర్స్ అయ్యింది. జర్నలిస్టుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తప్పదు, యాజమాన్యాల ఆలోచనలకు తగ్గట్టుగా వ్యవహరించాల్సిందేనేమో.! అలాగని, ఆత్మవంచన చేసుకుని జర్నలిజం రంగంలో కొనసాగితే ఎలా.? అన్న ప్రశ్న సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల నుంచి వ్యక్తమవుతోంది.

జర్నలిస్టుల్ని ఎలా కొనేయాలో రాజకీయ పార్టీలకు బాగా తెలుసు.. అమ్ముడుపోవడంలోనూ జర్నలిస్టులు అత్యుత్సాహం చూపుతున్నారా.? అంటే, ‘కాదు’ అని మాత్రం చెప్పలేం. అందుకే, జర్నలిజానికి ఈ దుస్థితి. రాజకీయ పార్టీలో కింది స్థాయి కార్యకర్తల కంటే కూడా నీఛంగా తయారైపోయింది జర్నలిస్టుల దుస్థితి ఇప్పుడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...