మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన కేసులో ఇప్పటిదాకా దోషులెవరన్నదీ తేలలేదు. దాదాపు మూడేళ్ళ క్రితం, సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ హత్య అప్పట్లో రాజకీయంగా పెను సంచలనమైంది. వైసీపీ, ఆ హత్య ద్వారా పొందిన రాజకీయ లబ్ది అంతా ఇంతా కాదు.
అసలు వైఎస్ వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్నదానిపై ఇప్పటిదాకా స్పష్టత లేకపోవడం ఈ కేసులోని ‘రాజకీయ లోతు’ని చెప్పకనే చెబుతోంది. అత్యంత కిరాతకంగా వివేకానందరెడ్డిని దుండగులు చంపేస్తే, ‘గుండెపోటు’గా తొలుత చిత్రీకరణ జరగడంతో అసలు కథ మొదలైంది.
వైఎస్ వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులు, అందునా వైఎస్ కుటుంబ సభ్యులు ఈ హత్యలో కీలక పాత్రధారులు, సూత్రధారులన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అప్పటికీ, ఇప్పటికీ ఆ ఆరోపణలు అలాగే సజీవంగా వున్నాయిగానీ, కేసు విచారణ మాత్రం ఓ కొలిక్కి రాలేదు.
వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ మొదలైంది. అంతకు ముందు సీబీఐ విచారణ కోరినవారు, ఆ తర్వాత సీబీఐ విచారణకు సుముఖత వ్యక్తం చేయకపోవడం వెనుక చాలా అనుమానాలున్నాయి.
ఇక, ఇప్పుడు ఏకంగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు. బెంగళూరులో ఓ భూ వివాదం సహా, కడప ఎంపీ టిక్కెట్ వివాదం.. వివేకా హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతా బాగానే వుందిగానీ, ఈ కేసు ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుంది.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ఎందుకంటే, ఇది రాజకీయ హత్య గనుక.!
138308 237926This is something I truly need to try and do a lot of analysis into, thanks for the post 554620
383622 590598Yay google is my world beater assisted me to uncover this great internet site! . 651825
212815 884519Wow i like yur website. It genuinely helped me with the details i wus seeking for. Appcriciate it, will bookmark. 386626
317171 306512This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for usually trying to drop the weight as properly within the have a significantly healthier lifetime. shed weight 771107
353658 616023extremely nice put up, i in fact love this internet internet site, keep on it 356741