Switch to English

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్.. జనానికి ఎవరు ఏం చేస్తున్నారు.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి మధ్యా పోలికల ప్రస్తావన సోషల్ మీడియాలో వస్తోంది.

ఒకరిది రాజకీయ వారసత్వం. తన తండ్రి ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి, తన తండ్రి రాజకీయాల్లో వున్నప్పుడే తానూ రాజకీయ రంగ ప్రవేశం చేశాను కాబట్టి.. తన తండ్రి తర్వాత తనకే ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదృష్టమో, దురదృష్టమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు కూడా.!

పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ఆయన లెక్క వేరు. సినిమాల్లో సంపాదించిన డబ్బు, పేరు ప్రఖ్యాతులు.. వీటన్నిటినుంచి పుట్టిన ఆలోచన, జనానికి సేవ చేయాలని. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని.!
రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. తాతలో, తండ్రులో.. వారి పేరు చెప్పుకుని, వారి పదవుల్ని అడ్డంపెట్టుకుని కోట్లు గడించి, అంతకు మించిన సంపాదన రాజకీయాల్లో వస్తుందనే యావతో రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు.

కానీ, సినీ రంగంలో సంపాదించుకున్న డబ్బు, పేరు ప్రఖ్యాతులు.. అశేష ప్రజానీకం పంచే అభిమానం.. వీటన్నిటినుంచీ ప్రజలకు సేవ చేయాలని కొంతమంది అనుకుంటారు.. ఆ లిస్టులో స్వర్గీయ ఎన్టీయార్.. తదితరులుంటారు.

చిరంజీవి కూడా అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థలో ఆయన ఇమడలేకపోయారు. ‘బురద’ అని తెలిసీ, పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లోకి దిగారు. ‘ఏం చేశామో చెప్పగల ధైర్యం చంద్రబాబు దత్త పుత్రుడికి వుందా..’ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

సినిమాల్లో తాను సంపాదించిన సంపాదనలోంచి దాదాపు 30 కోట్ల రూపాయల్ని ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంచుతున్నారు పవన్ కళ్యాణ్. ఏదీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన జేబుల్లోంచి రూపాయి అయినా తీసి జనానికి ఖర్చు పెట్టారేమో చెప్పమనండి చూద్దాం.. అన్నది జనసైనికుల ప్రశ్న.

ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తూ, జగనన్న విద్యా దీవెన, జగనన్న చిక్కీ.. అంటూ సొంత పేర్లు పెట్టుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, తన వ్యక్తిగత సంపాదనను ప్రజలకు పంచి పెడుతున్న పవన్ కళ్యాణ్‌కీ అస్సలు పొంతన లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య...

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి...

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి...

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేసిన “రామన్న యూత్” ఫస్ట్ లుక్

"జార్జ్ రెడ్డి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను...

సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ సినీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇటివల వయసు సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన...

బింబిసార ట్రైలర్‌.. మ్యాటర్ ఉన్న సినిమా

తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ తో బాహుబలి ని...

రాజకీయం

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...

‘రైలు తగులబెట్టి నన్ను చంపాలని చూశారు..’ ఎంపీ రఘురామ ఆరోపణ

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైలులో భీమవరం వెళ్తున్న తనను ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో చంపేందుకు కుట్ర పన్నారని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు...

జగనన్న విద్యా కానుక: పేదరికం పోవాలంటే చదువే మార్గం: సీఎం జగన్

పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని.. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో విద్యార్ధులకు కిట్లను పంపిణీ...

మురుగు కాల్వలో దిగి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగు కాల్వలో...

మెగాస్టార్ చిరంజీవిపై బులుగు పచ్చ అసహనం.!

మెగాస్టార్ చిరంజీవి చేసిన నేరమేంటి.? వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. అదేనండీ, బులుగు మీడియా.. అలాగే పచ్చ మీడియా.. ఎందుకు చిరంజీవి మీద విషం చిమ్ముతున్నట్టు.? ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: ఆదివారం 03 జూలై 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం సూర్యోదయం: ఉ.5:34 సూర్యాస్తమయం: సా.6:38 తిథి: ఆషాఢ శుద్ధ చవితి మ1:45 ని . వరకు తదుపరి ఆషాఢ శుద్ధ పంచమి సంస్కృతవారం: భాను వాసరః...

ప్రజలకు ముఖం ఎలా చూపిస్తారు.. రెబల్స్ పై ఆదిత్య ఫైర్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంకు తెరపడింది. శివసేన పార్టీకి చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఇవ్వడంతో రెబల్స్ కు నాయకత్వం వహించిన ఏక్‌ నాథ్ షిందే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ సమయంలో...

మోడీషా ‘మహా’ రాజకీయంకు దేశం షాక్‌

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎవరు ఊహించని టర్న్‌ తీసుకున్నాయి. దేశం మొత్తం అవాక్కయ్యాయి. శివ సేన పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఉద్దవ్‌ రాజీనామా...

ప్లెక్సీ వార్‌ పై కేసీఆర్ కు ఈటెల కౌంటర్‌

తెలంగాణ సీఎం కు మోడీ భయం పట్టుకుందని.. ఆయన హైదరాబాద్‌ కు వచ్చిన సమయంలో ఎక్కడ తెలంగాణ ప్రజలు ఆయన వైపుకు మళ్లుతారో అంటూ భయం టీఆర్‌ఎస్ వారిని వెంటాడుతుంది. అందుకే పీఎం...

ఏపీఎస్ఆర్టీసీ: ప్రయాణికులపై మరోసారి చార్జీల బాదుడు

రెండున్నర నెలల్లోనే ఏపీఎస్ఆర్టీసీ మరోసారి బస్సు చార్జీలు పెంచింది. పెంచిన టికెట్ ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వస్తాయి. ఏప్రిల్ 14న డీజిల్ సెస్ పేరుతో చార్జీలు పెంచి.. ఇప్పుడూ అదే పేరుతో...