Switch to English

‘దత్త పుత్రుడి’ ఎఫెక్ట్: వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమేనా.?

ముఖ్యమంత్రిగా వున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్ళు అంటకాగి, అదే పార్టీ మీద ఆ తర్వాత విమర్శలు చేసిన విషయం విదితమే. బీజేపీని, తెలంగాణ రాష్ట్ర సమితిని చంద్రబాబు టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల ప్రచారంలో నానా రకాల వ్యాఖ్యలూ చేశారు.

ఫలితం ఏమయ్యింది.? దారుణమైన పరాజయం మిగిలింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంతే. గడచిన మూడేళ్ళలో మూడు రాజధానులు కట్టేశామనో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేశామనో, కడప స్టీలు ప్లాంటు తెచ్చేశామనో, దుగరాజుపట్నం పోర్టు తెచ్చేశామనో చెప్పలేక.. ‘దత్త పుత్రుడు’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు.

వైసీపీకి సంబంధించిన వేదికలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తే, అది రాజకీయం. కానీ, అధికారిక కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాలు అమలు చేసే బహిరంగ సభల సాక్షిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ద్వారా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన స్థాయి తగ్గించేసుకుంటున్నారు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు అయితే చేశారో, అదే తప్పుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతకన్నా ఘనంగా చేసేస్తున్న దరిమిలా, 2024 ఎన్నికల్లో వైసీపీకి రాబోయే సీట్లు ఎన్ని.? అన్నదానిపై జనబాహుళ్యంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబుకి జనసేనాని దత్తపుత్రుడట.! అసలేమన్నా అర్థముందా వైఎస్ జగన్ విమర్శల్లో.? ఏ రకంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడట.? సినిమాల్లో సంపాదంచే కోట్లాది రూపాయలకు మించి, పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజీ ఇవ్వగల సత్తా చంద్రబాబుకి వుందా.? అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికైనా వుందా.?

ఇదీ జన బాహుళ్యంలో ‘దత్తపుత్రుడు’ వ్యవహారంపై జరుగుతున్న చర్చ. తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ‘సీబీఐ దత్త పుత్రుడు.. చంచల్ గూడా జైలు షటిల్ బ్యాచ్..’ అని జనం, ముఖ్యమంత్రిపై రచ్చబండల్లో వెటకారాలు చేసే పరిస్థితి వచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ చిత్రం హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు – నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

రాజకీయం

స్వేచ్ఛ.! స్వాతంత్ర్యం.! ప్రజలకా.? నేరస్తులకా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే...

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు...

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: కౌబాయ్ పాత్రలో చిరంజీవి స్టయిలిష్ మూవీ ‘కొదమసింహం’

కెరీర్లో రెగ్యులర్ మాస్, కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేశారు చిరంజీవి. దర్శకుడు బాపు మాటల్లో.. ‘చిరంజీవి మాస్ సినిమాలకు ఎడిక్ట్ అయిపోయాడు. అది ఆయన తప్పు కాదు. చిరంజీవి సాధించిన ఇమేజ్...

గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ: రామ్మోహన్ నాయుడు

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ అవుతుందనే ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయడు అన్నారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని.. మహిళల...

నాగార్జునతో పోటీకి సిద్ధమైన బెల్లంకొండ స్వాతిముత్యం

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ చిన్న కొడుకు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న విషయం తెల్సిందే. బెల్లంకొండ గణేష్ నటిస్తోన్న డెబ్యూ మూవీకి స్వాతిముత్యం అనే ఆసక్తికర...

కామన్వెల్త్ క్రీడల విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

దేశం గర్వించే ప్రతి సందర్భంలో తన శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుంటారు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్. దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకరంగా స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్...

ఆఫ్ట్రాల్ రోజా.! శతకోటి లింగాల్లో బోడి లింగం: రాయపాటి అరుణ

రోజా రెడ్డి అలియాస్ రోజా సెల్వమణి.. సినీ నటి మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. పైగా, ఆమె మంత్రి కూడా. కానీ, ‘ఆఫ్ట్రాల్ రోజా.. శతకోటి లింగాల్లో బోడి లింగం..’...