Switch to English

3 క్యాపిటల్స్‌: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్‌ సర్కార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. గవర్నర్‌ ఆమోదంతో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే రద్దుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సిద్ధపడగా.. హైకోర్టులో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో, ఈ నెల 14 వరకు ‘స్టేటస్‌ కో’ ఆదేశాలు జారీ అయిన విషయం విదితమే. అయితే, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

సోమవారం ఈ ‘ఎస్‌ఎల్‌పి’పై విచారణ జరిగే అవకాశం వుంది. సోమవారం అంటే ఈ నెల 10వ తేదీ అవుతుంది. అంటే, హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఆదేశాలు అప్పటికి ఓ నాలుగు రోజులు మాత్రమే అమల్లో వుంటాయన్నమాట. ‘అప్పటివరకు వేచి చూస్తే, హైకోర్టులోనే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేదమో.. ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాస్త తొందరపడినట్లే అన్పిస్తోంది..’ అన్న చర్చ కొందరు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. అయితే, వీలైనంత త్వరగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో వున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ముందుగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని అమరావతి నుంచి విశాకకు తరలించేయడానికి తొందరపడ్తోంది. కానీ, అలా తరలించాలంటే విశాఖలో అందుకు అనుకూలమైన భవనాల ఎంపిక ఈపాటికే జరిగిపోయి వుండాలి.

‘త్వరలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారు..’ అని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన దరిమిలా.. మళ్ళీ రాజధాని కోసం అన్నీ కొత్త నిర్మాణాలే అవసరమయ్యేలా వుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విశాఖ సంగతి సరే.. కర్నూలు మాటేమిటి.? కర్నూలులో పెడతామన్న జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ పరిస్థితేంటి.? దీనికి పెద్ద కథే వుంది. హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో వుండదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఆమోదం.. ఇలా చాలా వ్యవహారాలే వుంటాయి. ఎవరి వాదనలు ఎలా వున్నా, మూడు రాజధానుల విషయంలో తమది ముందడుగే తప్ప, వెనుకడుగు ప్రసక్తే లేదని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. అయితే, మరోమారు సుప్రీంకోర్టులో ‘మొట్టికాయలు’ తప్పవు.. అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...