Switch to English

టిబి స్పెషల్: అయిననూ పోవలెను విశాఖకు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి బాగా మొండిమనిషని పేరు. ఆ మొండితనమే అతనికి ఎన్నో కష్టాలను అధిగమించి సీఎం పీఠం దక్కేలా చేసిందన్నది విమర్శకుల అభిప్రాయం. ఎన్ని అవాంతరాలెదురైనా వెనక్కితగ్గటం అంటే ఆయనకు ఇష్టం ఉండదన్నది ఆంతరంగికుల మాట.

ఇలాంటి జగన్మోహనరెడ్డికి ఇప్పుడు కొంత గడ్డుకాలం నడుస్తోంది. దీనికి సైతం ఆ మొండితనమే కారణమన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీంతో తను అనుకున్నవి అనుకున్నట్లు జరగటం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి జై కొట్టిన జగన్, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.

దాంతో అప్పటివరకూ రేగిన ఇసుక దుమారాన్ని దాటుకుని నెమ్మదిగా గాడిలో పడుతోందనుకుంటున్న పాలన కాస్తా గందరగోళంలో పడింది. సుమారు 150 రోజులుగా రాజధాని రైతుల ఆందోళనలు ఓవైపు సాగుతోంటే మరోవైపు పాలనాపరంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇంకా హైకోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇక కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకునే రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటూనే వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేసుకోవాలని వైసీపీ అధిష్టానం ఉవ్విళ్లూరింది. అయితే వారి దూకుడుకు వరుస బ్రేకులు పడుతూనే ఉన్నాయి.

ఓవైపు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మంత్రాంగం, తన ఆలోచనలను సమర్ధంగా ముందుకు తీసుకెళ్లలేని యంత్రాంగం మరోవైపు జగన్ ఆలోచనల్ని కోల్డ్ స్టోరేజ్ కు పంపాయి. రాజధాని తరలింపుపై ఆ ప్రాంత రైతులు కోర్టుకి ఎక్కడం, మే నెలాఖరుకు కేపిటల్ తరలింపు జరగుతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ, తమకు న్యాయం చేయమని కోర్టును కోరిన నేపధ్యంలో ప్రభుత్వం తప్పక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

న్యాయ, శాసనపరమైన అంశాలన్నీ ముగిసిన తర్వాతనే తరలింపు ఉంటుందనీ, అప్పటివరకూ ఎలాంటి ముందడుగు లేదనీ కోర్టుకు అఫిడవిట్ ద్వారా తేల్చిచెప్పింది. దీంతో ఉన్నపళంగా విశాఖపట్నానికి రాజధాని తరలింపు ఉంటుంది, ఇప్పటికే 20 ట్రక్కుల ఫర్మిచర్ ఉంది, స్థానికంగా విజ్జాన్ కళాశాల సమీపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రెడీ అవుతోందన్న వార్తలకు తాత్కాలికంగా ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది.

కానీ జగన్ మాత్రం వీలైనంత త్వరగానే ఇక్కడి నుండి మకాం మార్చాలని భావిస్తున్నారు. చంద్రబాబు తాలూకు గత పాలనా ప్రభావం పడకుండా తనదైన మార్క్ చూపాలని ఆయన భావిస్తున్నారు. బాబు హయాంలో నిర్మించిన భవనాల్లో తాను అడుగుపెట్టేందుకు ఇష్టపడటం లేదన్నది సీఎంఓ వర్గాల సమాచారం.

మరి అలా జరిగితే వందల కోట్ల ప్రజాధనం వృధా అంటారా..? కాదని మేం ఎందుకంటాం…? ఉండవల్లి చంద్రబాబు నివాసం సమీపంలో కోట్లరూపాయల విలువైన ప్రజావేదికను నిలువునా కూల్చేసినపుడు అయ్యో అనుకున్నవాళ్లే చాలామంది ఉన్నారు. సరే, వాటి గురించి మళ్లీ మాట్లాడుకుందాం…మొత్తానికి కరోనా విపత్తు, వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాదఘటన జరగకపోయి ఉంటే ఈపాటికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ సమీక్షలు విశాఖలోనే జరిగి ఉండేవి.

అయిననూ విశాఖకూ పోవాల్సిందేనన్న జగన్ ఆదేశాలను అమలుచేసేందుకు, అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు ఆయన ఆంతరంగికులు విజయసాయిరెడ్డి,ఇతర మంత్రులంతా దిండూ, దుప్పట్లు పట్టుకుని మకాంలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన జగమొండితనాన్ని వీడి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తిపరిచేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా కాదంటారా…? ఇక మీ ఇష్టం..రాష్ట్ర ప్రజల్నీ, రాష్ట్రాన్నీ మీరు తరచుగా చెప్పే దేవుడే కాపాడాలి. శుభం భుయాత్..

సినిమా

సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోకు గాయాలు.!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్‌ డంను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో సూర్య తన హోం జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఏపీలో విమానం దిగాలంటే ఈ కండీషన్స్‌ తప్పనిసరి

నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్‌ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

విశాఖ వాసుల్ని బెంబేలెత్తించిన దట్టమైన పొగలు

12 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో ఘటన విశాఖ ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. కొద్దిసేపటి క్రితం విశాఖ, మల్కాపురంలోని HPCL రిఫైనరీ నుంచి దట్టమైన...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...