Switch to English

నరేంద్ర మోడీ ‘లోకల్‌ మంత్ర’.. సాధ్యమయ్యే పనేనా.?

20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రకటించిన దరిమిలా మార్కెట్లలో కొత్త ఊపు కన్పిస్తోంది. దేశమంతా మోడీ ప్రకటించిన ప్యాకేజీ తాలూకు రూపు రేఖలేంటో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిజానికి, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు అంకెలగారడీ చేయడం కొత్తేమీ కాదు.

మొన్నటికి మొన్న, దాదాపు లక్ష కోట్లపైన ఓ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. జన్‌ధన్‌ ఖాతాల్లో 500 రూపాయల చొప్పున మూడు నెలలపాటు డిపాజిట్‌ చేయడం సహా పలు అంశాలున్నాయి అందులో. అయితే, ఆ ప్యాకేజీ దేశ ఆర్థిక రంగానికి పెద్దగా ఉపశమనం కల్పించలేకపోయింది. అదే సమయంలో, ఆ ప్యాకేజీ పేరుతో జరిగిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, ఈసారి నరేంద్ర మోడీ ‘లోకల్‌ మంత్ర’ జపిస్తూ, 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం.

ప్యాకేజీ సంగతి పక్కన పెడితే, దేశంలో ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత గురించి నరేంద్ర మోడీ మాట్లాడటాన్ని పారిశ్రామిక వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. అయితే, అమలులో అది సాధ్యమేనా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ప్రపంచం చాలా చిన్నదైపోయింది. విదేశీ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం సర్వసాధారణ వ్యవహారంగా మారిపోయింది ఏ దేశానికైనా. మన దేశంలో ఇది మరీ ఎక్కువగా కన్పిస్తోంది ఇటీవలి కాలంలో. ఆ పెట్టుబడుల రూపంలో వచ్చే అనర్ధాల్ని కూడా మనం ఎక్కువగానే భరించాల్సి వస్తోంది. ఈ తరుణంలో స్వదేశీ మంత్రం జపించడమంటే కాస్త ఆసక్తికరమైన అంశమే.

నిజానికి పెద్ద నోట్ల రద్దు సహా అనేక కీలక నిర్ణయాల్ని నరేంద్ర మోడీ తీసుకున్నప్పుడు అంతా ఆహ్వానించారు. కానీ, వాటి ఫలితాలేంటి.? దేశానికి లాభం చేకూర్చలేదు సరికదా.. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి ఆ నిర్ణయాలు. ఇప్పుడీ స్వదేశీ మంత్రం కూడా వినడానికి చాలా బావుంది. చిత్తశుద్ధితో అమలు చేస్తే సత్పలితాలు రావడం ఖాయం. కానీ, గ్లోబలైజేషన్‌ అందుకు ఒప్పుకుంటుందా.? పాత ఒప్పందాల మాటేమిటి.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

మన దగ్గర ప్రొడక్టివిటీని పెంచి, విదేశాలకు ఎగుమతి చేస్తాం సరే.. దిగుమతులు తగ్గించాల్సి వస్తే.. వాటి చుట్టూ ఒప్పందాలు చేసుకున్న అమెరికా లాంటి అగ్రదేశాలు వేసే ఎత్తుగడలు ఎలా వుండబోతున్నాయి.? ఇలాంటి ప్రశ్నలు చాలా చాలానే ఉత్పన్నమవుతున్నాయి ఆర్థిక రంగ నిపుణుల నుంచి. ఏదిఏమైనా, కరోనా వైరస్‌ అనేది సంక్షోభం సృష్టించడం మాత్రమే కాదు, ఓ అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఆ అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నదానిపైనే మన భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న సమయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం వేల...

బ్రేకింగ్‌ గాసిప్‌: ఢిల్లీకి జగన్‌.. తన సమస్యలకి పరిష్కారం దొరికేనా?

రాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్‌ గాసిప్‌ జోరుగా చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ పెద్దలు అసహనంతో...

డబ్బు కోసం ఎన్నారైకి గృహిణి వల.. పెళ్లి చేసుకుందామంటూ..

తేలికగా డబ్బు సంపాదించి విలాసంగా బతికేద్దామనుకుంది ఆ కుటుంబం. ఓ ఎన్నారైను మోసం చేసి లక్షల్లో డబ్బు వసూలు చేయటానికి ప్రయత్నించింది ఆ ఇంటి ఇల్లాలు. చేయాలనుకున్న మోసం చేసి చివరకు పోలీసులకు...

బర్త్ డే స్పెషల్‌: అన్నగారు, మరో నూరేళ్లయినా సరిలేరు మీకెవ్వరు.!

తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దినది.. తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పించింది.. తెలుగు వారి ఆత్మ గౌరవంను కాపాడినది.. తెలుగు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించి పెట్టింది.. తెలుగు భాషను...

లారెన్స్ సినిమాకి ‘లక్ష్మీ బాంబు’ లాంటి ఆఫర్

ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో విధాలుగా నష్టాలను ఎదుర్కుంటున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. థియేటర్లు మూతపడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టబోతుంటే చిత్రీకరణలు లేక చిన్న స్థాయి నటీనటులు, రోజు...