Switch to English

అప్పు.. ఆంధ్రప్రదేశ్.! బాబూ, జగనూ.. ఇద్దరూ ఇద్దరే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మాట వాస్తవం.

‘సంక్షోభాల్ని అవకాశంగా మలచుకుని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు..’ అన్నారు చంద్రబాబు. కానీ, రాష్ట్రాన్ని తన ఐదేళ్ళ పాలనలో మరింత సంక్షోభంలోకి నెట్టేశారాయన. చంద్రబాబు పాలన పుణ్యమా అని రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది.

నిండా మునిగినోడికి చలేంటని అనుకున్నారో ఏమోగానీ, రాష్ట్రాన్ని మరింతగా అప్పుల్లోకి ముంచేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగనన్న గోరుముద్ద.. జగనన్న కానుక.. జగనన్న అది, జగనన్న ఇది.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పేరు మీద బోల్డన్ని సంక్షేమ పథకాలు తెరపైకి తెచ్చి, రాష్ట్రాన్ని ఇంకా ఇంకా సంక్షోభంలోకి నెట్టేశారు.

చంద్రబాబు పాలనలో రికార్డు స్థాయిలో అప్పులు జరిగాయి. అంతకు మించిన రికార్డు స్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అప్పులు జరుగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ చిన్న తేడా ఏంటంటే.. ఇప్పుడు అప్పులు కూడా దొరకడంలేదు. దొరికిన అప్పులు కూడా బకాయిల కింద అప్పటికప్పుడు గల్లంతయిపోతున్నాయట.

మరి, సమీప భవిష్యత్తులో రాష్ట్రం కొత్త అప్పు చేయలంటే ఎలా.? అప్పు కనాకష్టంగా దొరకొచ్చుగాక.. కానీ, అప్పు చేసే ప్రతి పైసా కూడా, అంతకు ముందు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికీ సరిపోకపోవచ్చు. మేం ఉద్ధరించేశాం.. అని చంద్రబాబు అంటోంటే, కాదు కాదు.. మీరు ముంచేశారు, మేం ఉద్ధరిస్తున్నామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. కానీ, ఇద్దరూ ఉద్ధరించట్లేదు.. ఇద్దరూ కలిసి ఓ అవగాహనకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారనడం సబబేమో.!

వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్నది వేరే చర్చ. రానున్న రెండేళ్ళలో రాష్ట్రం ఏమైపోతుంది.? అన్న ఆవేదన అయితే అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ కాస్తా అప్పుల ప్రదేశ్ అయిపోయింది మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...