శ్రీలీల… టాలీవుడ్ లో అత్యంత బిజీగా, తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్. ఈమె నటించిన స్కంద పక్కనపెడితే మిగిలిన చిత్రాలు అన్నీ కూడా సూపర్ హిట్టే. రీసెంట్ గా విడుదలైన భగవంత్ కేసరిలో ఆమె సెకండ్ హీరో తరహా పాత్రను చేసి మెప్పించింది.
శ్రీలీల ట్రాక్ రికార్డ్ పక్కనపెడితే ఆమె నటించే సినిమాల్లో కుర్ర హీరోలకు ఒక ఇబ్బంది వస్తున్నట్లు సమాచారం. అదే ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్. సాధారణంగా హీరోలు పాటల్లో హీరోయిన్లను డామినేట్ చేయడానికి చూస్తుంటారు. అలాంటిది శ్రీలీల ఉందంటే పాటల్లో ఫోకస్ ఆమె మీదే ఉంటోంది.
డ్యాన్స్ మాస్టర్లు కూడా శ్రీలీలకు స్పెషల్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన లీలమ్మ సాంగ్ నే తీసుకోండి. వైష్ణవ్ తేజ్ ను పూర్తిగా డామినేట్ చేసేసింది శ్రీలీల. మరి ఈ మార్పును కుర్ర హీరోలు ఎలా తీసుకుంటారో ఏమో.