బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ చంద్ర కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ అయ్యి షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఏ క్షణాన షూటింగ్ మొదలైందో కానీ అప్పటినుండి రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్ధిక సమస్యలు తలెత్తాయని కొన్ని రూమర్లు వస్తే, సెకండ్ హాఫ్ లేకుండా సినిమా మొదలుపెట్టారని మరికొన్ని రూమర్లు వినిపించాయి. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారని కూడా అన్నారు.
అయితే ఇవన్నీ ఒట్టి రూమర్లే అని తేలిపోయింది. ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 30న మొదలవుతుందట. ఈ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారట. బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రానికి టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తారు కూడా.