Switch to English

ఎర్రన్నా, ఆ ముగ్గుర్నీ గెలిపించావన్నా!

91,318FansLike
57,014FollowersFollow

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు ఈసారి విజయం సాధించారు. అందులో ఒకరు ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు కాగా, మరొకరు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌నాయుడు. ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ సైతం ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు తమ సిట్టింగ్‌ స్థానాల్ని నిలబెట్టుకోవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

ఓ దశలో అచ్చెన్నాయుడు ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. రామ్మోహన్‌నాయుడు అయితే బొటాబొటి మెజార్టీతో గట్టెక్కారు. అచ్చెన్నాయుడిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు పేరు చెబితే అభివృద్ధి గుర్తుకు రాదు సరికదా, అరాచకాలే గుర్తుకొస్తాయంటారు చాలామంది. అయితే, అదంతా ప్రత్యర్థుల పసలేని ఆరోపణలు తప్ప, నిజం కావనీ, అందుకు తన గెలుపే నిదర్శనమనీ అచ్చెన్నాయుడు అంటున్నారు.

మరోపక్క, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా షాక్‌ తగిలింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవిపై సానుకూలత వున్నా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వేవ్‌ కారణంగా ఆమె పరాజయం పాలయ్యారు. గెలవడం అసాధ్యమనుకున్న ధర్మాన ప్రసాదరావు ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇక, అచ్చెన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ విషయానికొస్తే ఆమె అనూహ్యంగా టిక్కెట్‌ దక్కించుకున్నారు, అంతే అనూహ్యంగా విజయాన్ని అందుకున్నారు. చివరి నిమిషంలో టిక్కెట్‌ ఖరారైనా, మెరుపు వేగంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆదిరెడ్డి భవానీ, దాదాపు ప్రతి ఇంటి తలుపూ తట్టి, తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ చాలా ఎక్కువగా జరగడం గమనార్హం.

ఏదిఏమైనా ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు చట్ట సభలకు ఎంపిక కావడం పట్ల శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మినహాయిస్తే రామ్మోహన్‌నాయుడు, ఆదిరెడ్డి భవానీల పట్ల పార్టీలకతీతంగా సానుకూలత వుంది. అదే వారి గెలుపుకు కారణమైంది. ఐదేళ్ళు ఎంపీగా పనిచేసినా రామ్మోహన్‌నాయుడిపై ఒక్క అవినీతి మరకా అంటలేదు సరికదా, మంచి వక్తగా.. అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన విజయం నల్లేరు మీద నడకేనని చిక్కోలు ప్రజానీకం అనుకున్నారుగానీ, వైఎస్సార్సీపీ సునామీ ముందు ఆయన కూడా ఒకింత వణకక తప్పలేదు. ఎలాగైతేనేం, చివరికి రామ్మోహన్‌ విజయాన్ని అందుకున్నారు. రామ్మోహన్‌నాయుడు, ఆదిరెడ్డి భవానీల గెలుపుతో ‘ఎర్రన్నా.. గెలిపించావన్నా’ అని అనుకుంటున్నారు ఎర్రన్నాయుడు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్,...

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’....

కథలో మార్పులు చేస్తున్న పవన్ కల్యాణ్.. గట్టిగానే ఇస్తాడట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్...

వైయస్ఆర్‌తో పాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సింది.. షాకింగ్ విషయాలను వెల్లడించిన కిరణ్ కుమార్...

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షో తాజాగా నాలుగో ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు చీఫ్ గెస్టులుగా, ఏపీ రాష్ట్ర మాజీ...

కెప్టెన్ ఇనాయా.! ఫిజికల్ టాస్క్‌లో అమ్మాయిలదే హవా.!

సాధారణంగా ఫిజికల్ టాస్క్ అనగానే, అమ్మాయిలు - అబ్బాయిల మధ్య రచ్చ జరుగుతుంటుంది. అక్కడ టచ్ చేశావ్.. ఇక్కడ చెయ్యి పెట్టావ్.. అంటూ ఫిమేల్ కంటెస్టెంట్లు...

రాజకీయం

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

‘మూడు రాజధానులంటే..’ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

‘అసెంబ్లీ సమయంలో అధికారులు అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్, సెక్రటేరియట్ కు సంబంధించింది. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి.. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అందించాలి. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి.. వాళ్ల...

ఎక్కువ చదివినవి

‘మూడు రాజధానులంటే..’ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

‘అసెంబ్లీ సమయంలో అధికారులు అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్, సెక్రటేరియట్ కు సంబంధించింది. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి.. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అందించాలి. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి.. వాళ్ల...

పవర్ స్టార్ కు బాస్ పార్టీ పిచ్చ పిచ్చగా నచ్చేసిందిట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే చిత్ర ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఈ...

‘విలక్షణ వ్యక్తిత్వం మీ సొంతం’.. చిరంజీవికి ప్రధాని మోదీ ప్రశంసలు..

మెగాస్టార్ చిరంజీవిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా చిరంజీవికి ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్...

శ్రీహాన్‌తో సిరి.! ఈ ముద్దుల గోలేంటి బిగ్ బాస్.!

అసలే బిగ్ బాస్ రియాల్టీ షో మీద ‘బ్రోతల్ హౌస్’ అనే విమర్శలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఆ విమర్శలు అత్యంత జుగుప్సాకరమే అయినా, ఆ మచ్చని చెరిపేసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించడంలేదు బిగ్...

రాశి ఫలాలు: మంగళవారం 22 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక బహుళ త్రయోదశి ఉ.6:53 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: స్వాతి రా.11:44 వరకు తదుపరి విశాఖ యోగం:...