ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే అయినా.. ఎలా పుట్టిందో.. ఎందుకు ఇంతగా వ్యాపించిందో ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అయితే.. ఈ వైరస్ వ్యాప్తికి గల కారణాలను కొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వుహాన్ నగర అధికారుల రికార్డు పిచ్చే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి కావడానికి కారణమైందని అంటున్నారు. జనవరిలో నూతన సంవత్సర వేడుక నిర్వహణతో అత్యధిక వంటలతో ప్రపంచ రికార్డు నెలకొల్పాలని వుహాన్ నగర అధికారులు భావించారు.
ఇందుకు ఓ సామూహిక విందును ఏర్పాటు చేస్తే 40వేల కుటుంబాలు పాల్గొన్నాయి. మొత్తం 13, 986 వంటకాలు వడ్డించారు. ఈ విషయాన్ని ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తన కథనంలో తెలిపింది. అప్పటికే కరోనా వుహాన్ లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నా అధికారులు ఈ వైరస్ ప్రభావాన్ని లెక్క చేయలేదు. ఆ విందే ఈరోజు ఇంతటి ఉపద్రవానికి కారణమైందని.. అదే వైరస్ ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణమైందని సీఎన్ఎన్ ప్రతినిధి ఫరీద్ జకారియా తెలిపారు. చైనీయులు ఉపయోగించే స్పూన్లు, చాప్ స్టిక్స్ వల్ల ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువైపోయింది.
విందు జరిగిన ప్రాంతంలో దాదాపు 57 భవనాలు ఉన్నాయి. విందు జరిగిన 15 రోజుల్లోనే దాదాపు 33 భవనాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో మొత్తం 1,30,000 మంది నివసిస్తున్నారు. వైరస్ వ్యాప్తి వేగం కావడంతో దేశంలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణలు వుహాన్ చేరుకున్నారు. జనవరి 23కి పరిస్థితులు తీవ్రమవుతాయని భావించి వుహాన్ లో లాక్ డౌన్ విధించారు. కానీ వైరస్ వ్యాప్తి జరిగిపోవడం.. అప్పటికే అనేకమంది వివిధ ప్రాంతాలు, దేశాలు కూడా దాటేయడంతో పరిస్థితులు చేజారిపోయాయి.
113102 964966extremely good publish, i surely really like this web internet site, carry on it 469869
421306 62039I visited a lot of site but I conceive this one holds something special in it in it 499314