తెలంగాణలో తాజాగా ఈ రోజు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణ రాష్ట్రం కూడా ‘థౌజండ్’ క్లబ్లో చేరినట్లయ్యింది. మొత్తంగా తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1001కి చేరింది. మరోపక్క, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 316కి చేరుకోగా, మొత్తం మృతుల సంఖ్య 25.
ఇదిలా వుంటే, ఈ రోజు నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. మొత్తమ్మీద, తాజా లెక్కలతో కరోనా వైరస్ నుంచి తెలంగాణ కాస్త తేరుకుంటున్నట్లే కన్పిస్తోంది. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో తక్కువ సంఖ్యలో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.
తెలంగాణకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరకున్న విషయం విదితమే. తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అయితే, చాలా చోట్ల ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తోంటే, కొన్ని చోట్ల మాత్రం లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతుండడంతో తెలంగాణలో పరిస్థితి ప్రస్తుతానికి కంట్రోల్లోకి వచ్చినట్లే కన్పిస్తోందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే తెలంగాణలో చాలా జిల్లాలు కరోనా వైరస్ నుంచి విముక్తి పొందుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా కేసుల తీవ్రత తగ్గుతోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
మే 3వ తేదీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేస్తారనే ప్రచారం జరుగుతుండగా, తెలంగాణలో మాత్రం మే 7 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం స్పష్టతనిచ్చిన విషయం విదితమే. ఏదిఏమైనా, తెలంగాణలో తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం మాత్రమే.. లాక్డౌన్ ఎత్తివేత లేదా సడలింపు.. ఏది జరిగినా.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఇప్పుడే అంచనా వేయలేం.
938489 506366I discovered your blog website website on the search engines and check several of your early posts. Always maintain up the really excellent operate. I recently additional increase Rss to my MSN News Reader. Looking for toward reading much far more on your part later on! 912056
367603 394189I wish I had a dime for every bad post Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 946123
408295 975434This web site is my inhalation, genuinely fantastic layout and Perfect written content. 854568
641003 436016Its remarkable what supplementing can do for your body and your weight lifting goals! 41781
126705 82030Giving you the most effective News is very considerably imptortant to us. 102994
416892 200598Normally I do not read post on blogs, but I wish to say that this write-up quite forced me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite nice write-up. 195610