Switch to English

ముఖ్యమంత్రులతో మోడీ భేటీ.. ఈసారి ఏం చెబుతారో.!

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా రేపు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు.. అదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా. ఇప్పటికే రెండు సార్లు ఈ తరహా ‘వీడియో కాన్ఫరెన్స్‌’లు నిర్వహించారు ప్రధాని. మే 3వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న దరిమిలా.. ముఖ్యమంత్రలుతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏప్రిల్‌ 14వ తేదీలో లాక్‌డౌన్‌ ముగియాల్సి వుండగా, దాన్ని మే 3వ తేదీ వరకూ పొడిగించిన విషయం విదితమే. అయితే, ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని సడలింపుల్ని కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత మరిన్ని సడలింపులు రాబోతున్నాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తుండడంతో మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశాలున్నాయనీ, ఇంకోసారి పొడిగింపు తప్ప మరో మార్గం కన్పించడంలేదనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తే.. ఆ తర్వాత భయానక పరిస్థితులు వుంటాయి..’ అని ఇప్పటికే పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్న సంగతి తెల్సిందే. మే 7వ తేదీ వరకూ తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ని పొడిగించగా, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి. అయితే, కేంద్రం ఆలోచనలు కాస్త భిన్నంగా వున్నాయనే చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌ని కొనసాగించినా, చాలా సడలింపులు వుండబోతున్నాయట.

ప్రజల ప్రాణాల్ని కాపాడుతూనే, ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుందనీ, ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘కీలకమైన నిర్ణయం’ తీసుకోబోతోందనీ ఢిల్లీ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. జనం ఎక్కువగా గుమికూడేందుకు అవకాశాలున్న సినిమాలు, షాపింగ్‌ మాల్స్‌, పబ్లిక్‌ పార్కులు వంటి వాటికి లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ, మిగతా ముఖ్యమైన అంశాలకు వెసులుబాటు వచ్చే అవకాశాలున్నాయి. ప్రజా రవాణా విషయంలోనే కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అన్ని అంశాలపైనా రేపు సాయంత్రానికి ఓ స్పష్టత రాబోతోందట.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

బ్రేకింగ్ న్యూస్: నల్గొండలో భారీ పవర్ ప్లాంట్ బ్లాస్ట్.!

గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీని వలన తాజాగా తెలంగాణ, నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి...

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...