పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన రేణు దేశాయ్ మెగా ఫ్యామిలీకి పూర్తి దూరంగా తెలుగు ప్రేక్షకులకు కూడా దూరంగా పుణెలో ఉంటుంది. అయితే ఆమెను సోషల్ మీడియాలో అనుసరిస్తున్న వారిలో తెలుగు వారే ఎక్కువ. రేణు దేశాయ్ తెలుగులో నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ఇటీవల ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్‌కు కూడా అమ్మగా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొంది.
నేడు మరో టీవీ ఛానెల్‌కు రేణు దేశాయ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా న్యూస్ ఛానెల్ యాంకర్ పవన్ కళ్యాణ్ ప్రస్థావన తీసుకు వచ్చారు. మీరు సినిమాల్లోకి రావాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్ కూడా చేయాలని భావిస్తున్నారు. కనుక పవన్ కళ్యాణ్ సినిమాల్లో లీడ్ రోల్ చేయడం కాని లేదంటే ఆయన సినిమాకు డైరెక్ట్ చేయడం కాని చేసే అవకాశం ఉందా అంటూ యాంకర్ ప్రశ్నించాడు.
ఆయన ప్రశ్నకు కాస్త అసహనం వ్యక్తం చేసిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ప్రస్థావన లేకుండా ఇంటర్వ్యూ చేయలేరా అంటూ ప్రశ్నించింది. దాంతో యాంకర్ మీరు ఒక కథ తయారు చేసుకున్నారు కదా ఆ కథ పవన్ తో అయితే బాగుంటుంది అనుకుంటే ఆయనతో సినిమా చేస్తారా అంటూ ప్రశ్నించాడు. అప్పుడు అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆమె ఎక్కువగా మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
184690 247023Located your weblog and decided to have a study on it, not what I usually do, but this blog is fantastic. Awesome to see a internet site thats not spammed, and in fact makes some sense. Anyway, great write up. 790427