Switch to English

మెగా క్వశ్చన్‌: చిరంజీవి ఆ ‘రిస్క్‌’ తీసుకోగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సినిమా కెరీర్‌ మీదనే ఫోకస్‌ పెట్టారు. రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని ఆయన పదే పదే చెబుతున్నారు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రజల ముందుకు వెళ్ళిన చిరంజీవి, అధికారాన్ని దక్కించుకోలేకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సంపాదించుకున్నారన్నది నిర్వివాదాంశం. అయితే, రాష్ట్ర విభజన సహా.. అనేక అంశాలు చిరంజీవి రాజకీయాల్లో నిలదొక్కుకోలేని పరిస్థితిని తీసుకొచ్చాయి. కులం పేరుతో, ప్రాంతం పేరుతో చిరంజీవి జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. చిత్రంగా ఎవరైనా ఆ తరహా నీఛ నికృష్ట రాజకీయాలు చేశారో.. వాళ్ళంతా ఇప్పుడు రాజకీయాల్లో బాగానే వున్నారు. అదే మరి, రాజకీయం అంటే.

ఇక, ఇప్పుడు చిరంజీవి బీజేపీలో చేరతారనే ప్రచారానికి తెరలేపారు కొందరు. పైగా, చిరంజీవి చుట్టూ మళ్ళీ ‘క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌’ని తెరపైకి తెస్తున్నారు. ‘కాపు’ కోటాలో చిరంజీవిని బీజేపీ ఆకర్షిస్తోందన్నది ఆ విశ్లేషణల సారాంశం. ప్రస్తుతం రాజకీయాలు ‘కులం, మతం, ప్రాంతం’ ప్రాతిపదికన నడుస్తున్నాయి గనుక.. ఏమో, అలాంటి ‘స్కెచ్‌’ వెనకాల నడుస్తోందో ఏమో కూడా.! అయితే, కేవలం చిరంజీవి చుట్టూనే ఎందుకు ఈ కులం ముద్ర.? అంటే, ఇక్కడ మేటర్‌ క్లియర్‌. చిరంజీవికి వున్న ‘అందరివాడు’ అనే ఇమేజ్‌ని చెడగొట్టడం కోసమే. ‘చిరంజీవి మా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం..’ అని బీజేపీ నేతలు ఇప్పటికే స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. ఆ మాటకొస్తే, చిరంజీవికి రాజ్యసభ సీటుతోపాటు, కేంద్ర మంత్రి పదవిని కూడా గతంలో బీజేపీ ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, హైద్రాబాద్‌లో చిరంజీవిని ప్రత్యేకంగా కలవడంతో మళ్ళీ మెగాస్టార్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న ప్రచారం షురూ అయ్యింది.

అయితే, మెగాస్టార్‌ చిరంజీవి సన్నిహితులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. చిరంజీవికి టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.. వైసీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి.. అలాగని ఆయన ఏ పార్టీనీ బహిరంగంగా సమర్థించడంలేదు. ‘మా కుటుంబంలో ఒకటే పార్టీ..’ అని ఇటీవలే తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవి చెప్పిన దరిమిలా.. జనసేన పార్టీలో సైతం ఆయన చేరకపోయినా.. జనసేన పార్టీకి ‘మెగా’ ఆశీస్సులు మాత్రం అందిస్తుంటారన్నమాట. ఇక, బీజేపీలో చేరడం సంగతంటారా.. అది చిరంజీవి మీద బురద చల్లే క్రమంలో తెరపైకొచ్చిన ‘క్యాస్ట్‌ పైత్యం’ మాత్రమే కావొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...