Switch to English

పవన్ కళ్యాణ్‌కి జ్వరం వస్తే, వైసీపీ ఎందుకు వణుకుతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వాస్తవానికి, పిఠాపురం వెళ్ళేముందే ఆయన జ్వరంతో బాధపడ్డారు. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వుండడంతో, పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అదీ జ్వరంతోనే.

పార్టీ ముఖ్య నేతలు వారిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మండుటెండల్లోనే ఇంటింటి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీవ్ర జ్వరం బారిన పడ్డారు. వైద్యులు ఆయనకువ వైద్య చికిత్స అందించారు. రెండు మూడు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.

ఇక, ఇప్పుడు మొదలైంది వైసీపీ మార్కు రాజకీయం. ఒక్క రోజు ఎండలో తిరిగినందుకే జ్వరం బారిన పడ్డారు పవన్ కళ్యాణ్.. మరి, అవ్వా తాతలు ఎండలో పెన్షన్ల కోసం ఎలా వెళతారు.? అంటూ రాజకీయం మొదలెట్టేసింది వైసీపీ. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా వుంటుందా.?

అసలు సామాజిక పెన్షన్లు – వాలంటీర్ వ్యవస్థ.. ఇది చాలా పెద్ద డిబేట్. యాభై కుటుంబాలకు ఓ వాలంటీర్.. ఆ వాలంటీర్‌కి గౌరవ వేతనం, సాక్షి పత్రిక, ఓ మొబైల్ ఫోన్.. ఇదంతా పెద్ద తతంగం. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పారు.

ఆర్థిక సంవత్సరం పూర్తయిన దరిమిలా, బ్యాంకులకు సెలవులు రావడంతో.. ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో పెన్షన్ నగదు జమ అవడం ఆలస్యమయ్యింది. మూడో తేదీ తర్వాత పెన్షన్ల పంపిణీ.. అని ప్రభుత్వమే ప్రకటించింది. రెండ్రోజులు హైడ్రామాకి తెరలేపింది వైసీపీ.. ఈ అవకాశాన్ని చూసుకుని.

జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా పూనుకుని, వృద్ధుల్ని గ్రామ సచివాలయాల దగ్గరకు తీసుకెళ్ళి మరీ పెన్షన్లు ఇప్పించారు. ఇంతకీ, వైసీపీ కార్యకర్తలు ఏం చేసినట్టు.? ఇంకేం చేస్తారు.. నిస్సిగ్గు రాజకీయమే చేస్తారు. అదే చేశారు కూడా.!

ఇంకోపక్క, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారనీ, జ్వరం అనేది నాటకమనీ వైసీపీ విష ప్రచారానికి తెరలేపింది. వైసీపీ అంటేనే విష ప్రచారం.! పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కి లక్ష మెజార్టీ ఖాయమన్న ప్రచారం దరిమిలా, వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోంది. ఈ క్రమంలోనే వాలంటీర్ల రచ్చ.. పెన్షన్ల పేరుతో హైడ్రామా.. సినిమా షూటింగులంటూ విష ప్రచారం.. ఇంత రోగిష్టి రాజకీయాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందన్నమాట.

ఇప్పుడే ఏమైంది.? ముందు ముందు చాలా చాలా నీఛ నికృష్ట రాజకీయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నుంచి చూడబోతున్నాం. పెన్షన్ నాటకంలో భాగంగా, 31 మంది వృద్ధులు చనిపోయారంటూ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం అత్యంత హేయం.

శవం కనిపిస్తే చాలు, రాజకీయం చేసే వైసీపీ, ఏ అనారోగ్య సమస్యతో ఎవరు చనిపోయినా అక్కడ వాలిపోయి.. శవ రాజకీయాల్ని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చేసేస్తోంది. కాదేదీ వైసీపీ రాజకీయానికి అనర్హం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...