కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’కి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సౌత్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. మొదటి పార్ట్ అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ పార్ట్‌కు హైప్ బాగా ఉంది. ఆ హైప్‌ను మరింతగా పెంచేలా దర్శకుడు ప్రశాంత్ బాలీవుడ్ స్టార్స్‌ను ఈచిత్రంలో నటింపజేస్తున్నాడు. కేజీఎఫ్ 2 చిత్రంలో తాజాగా రవీనా టాండన్‌ను కీలక పాత్రకు ఎంపిక చేసిన విషయం తెల్సిందే.
కీలకమైన లేడీ ప్రధాన మంత్రి పాత్రకు గాను మొదట బాహుబలి అమ్మ శివగామి రమ్యకృష్ణను అనుకున్నారట. కేజీఎఫ్ 2లో నటించేందుకు రమ్యకృష్ణ ఆసక్తి చూపించినా కూడా ఆమె పారితోషికం మరీ ఎక్కువ డిమాండ్ చేసిందట. కొద్ది రోజుల షూటింగ్‌కే రమ్యకృష్ణ చేసిన డిమాండ్‌తో దర్శకుడు షాక్ అయ్యాడట. దర్శకుడు ఆఫర్ చేసిన పారితోషికంకు రమ్యకృష్ణ నో చెప్పడంతో ఆమె స్థానంలో రవీనాను తీసుకున్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రమ్యకృష్ణ డిమాండ్ చేసిన పారితోషికం కంటే తక్కువే రవీనాకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మను తీసుకు వచ్చాం అంటూ మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్‌పై ఎక్కువ పోకస్ పెట్టిన మేకర్స్ రవీనా టాండన్ ఎంట్రీతో అక్కడ మరింత హైప్ ఖాయం అని ఆశ పడుతున్నారు.
ఈసారి కేజీఎఫ్ 2 బాలీవుడ్ టార్గెట్ వంద కోట్లుగా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సమ్మర్లో సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా కాస్త ఆలస్యంగా అంటే జులై చివరి వరకు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
463760 102153Chaga mushroom tea leaf is thought-about any adverse health elixir at Spain, Siberia and lots of n . Countries in europe sadly contains before you go ahead significantly avoidable the main limelight under western culture. Mushroom 9660
879943 917316Find out these pointers read on and learn to know how to submit an application doing this that you policy your corporation today. alertpay 901986
300216 954082When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with exactly the same comment. Maybe there is by any means you may get rid of me from that service? Thanks! 98812
15274 273605Wow i like yur web site. It really helped me with the data i wus seeking for. Appcriciate it, will bookmark. 520114