Switch to English

యుద్ధ సందేశమా.. మోదీ లెహ్ వెళ్లింది ఎందుకు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ అకస్మాత్తుగా లెహ్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణెలతో కలిసి మోదీ అకస్మాత్తులో లెహ్ వెళ్లారు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉన్న కీలకమైన ఫార్వర్డ్ లొకేషన్ నీములో పర్యటించారు. సరిహద్దుల్లో పరిస్థితులు, యుద్ద సన్నద్ధత వంటి అంశాలపై ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జవాన్లతో మాట్లాడారు. గల్వాన్ ఘర్షణల్లో గాయపడిన జవాన్లను కూడా పరామర్శించనున్నారు. కాగా మన దేశ ప్రధాని నీములో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

నిజానికి శుక్రవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే, గురువారం సాయంత్రం రాజ్ నాథ్ పర్యటన రద్దు అయినట్టుగా ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. అయితే, ఎందుకు రాజ్ నాథ్ పర్యటన రద్దు అయిందనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మోదీ లెహ్ వెళ్లడం సంచలనమైంది. ప్రధాని పర్యటన గురించి చివరి క్షణం వరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు సైతం తెలియదని సమాచారం.

గల్వాన్ ఘర్షణల తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు చర్చలు జరుగుతున్నా చైనా మాత్రం తన బలగాలు, ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తోంది. దీంతో భారత్ సైతం అంతే ధీటుగా స్పందించి మన బలగాలను సరిహద్దులకు తరలించింది. మరోవైపు చైనా అటు పాకిస్తాన్ తోనూ, ఇటు ఉగ్రవాదులతోనూ కూడా సంప్రదింపులు జరిపి భారత్ పైకి ఎగదోస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ముప్పేట దాడి ద్వారా భారత్ ను దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న డ్రాగన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ కూడా సిద్ధమవుతోంది.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకే ప్రధాని మోదీ లెహ్ లో పర్యటించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రధాని లెహ్ పర్యటన భారత సైనికుల్లో కదనోత్సాహం నింపిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. అక్కడ పర్యటించేందుకు వెళ్లిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ పర్యటన తర్వాత ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ లతో సమావేశమవుతారు. దీంతో అందరి దృష్టీ ఈ భేటీపైనే ఉంది.

యుద్ధ సందేశమా.. మోదీ లెహ్ వెళ్లింది ఎందుకు? యుద్ధ సందేశమా.. మోదీ లెహ్ వెళ్లింది ఎందుకు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...