Switch to English

జనసేనానికి సొంత నియోజకవర్గమెక్కడ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాన్ని ముందే ఎంచుకోవడం, అక్కడినుంచే రాజకీయ కార్యకలాపాల్ని విస్తృతంగా నడిపించడం ఏ నాయకుడికైనా అత్యవసరం. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే బాటని ఎంచుకోవాల్సి వుంటుంది. జనసేన పార్టీ ఇటీవలి ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఓటమి వెనుక కారణాల్ని కనుగొనడం ఎంత అవసరమో, వాస్తవాల్ని అంగీకరించి, భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో, అన్నిటికన్నా ముఖ్యమైన పని, పవన్‌ కళ్యాణ్‌ తన సొంత నియోజకవర్గాన్ని ఎంచుకోవడం.

2024లో ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నారో, ఇప్పుడే ఓ అవగాహనకు రావాల్సి వుంటుంది. ఇదే విషయాన్ని జనసేన పార్టీ సమీక్షల్లో అధినేతకు, ముఖ్య నేతలు సూచనలు చేస్తున్నారట. ‘భీమవరం అయినా, గాజువాక అయినా.. లేదంటే ఇంకో నియోజకవర్గం ఏదైనాసరే.. తొలుత మీ నియోజకవర్గాన్ని ఖరారు చేసుకోండి..’ అని దాదాపుగా అన్ని సమీక్షల్లోనూ జనసేన ముఖ్య నేతలు పవన్‌ కళ్యాణ్‌కి సూచిస్తున్నారని సమాచారమ్‌.

దాంతో, జనసేన అధినేత కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సొంత జిల్లా గనుక, పశ్చిమగోదావరిలో నియోజకవర్గాన్ని ఎంచుకుంటే విమర్శలొస్తాయన్న బావనలో వున్నారట జనసేనాని. దాంతో, గాజువాక వైపే మొగ్గు చూపుతారన్నది మెజార్టీ జనసేన నేతల అభిప్రాయం. మరోపక్క, ఈ రెండూ కాదు.. ఇంకో నియోజకవర్గాన్ని జనసేనాని ఎంచుకుంటారన్న వార్తలూ వస్తున్నాయి. రెండు మూడు నెలల్లోనే జనసేనాని, తన సొంత నియోజకవర్గాన్ని ఫైనల్‌ చేస్తారనీ, అదే సమయంలో.. 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనీ, అభ్యర్థులనదగ్గ స్థాయిలో నేతలు ఆయా నియోజకవర్గాల్లో పనిచేయాల్సి వుంటుందనీ సమీక్షీల్లో పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.

ప్లానింగ్‌ బాగానే వున్నా, ఎగ్జిక్యూషన్‌ అంత తేలిక కాదు. ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, రానున్న ఐదేళ్ళలో ధీటుగా ఎదుర్కొనడం కత్తి మీద సామే. నేతలు, ప్రలోభాలకు లోను కాకుండా వుండగలరా.? అన్నదానిపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుంది. ఏదిఏమైనా, మాటల్లోని ఖచ్చితత్వం.. చేతల్లో కూడా జనసేనాని చూపించగలిగితే, 2024 నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎదిగేందుకు జనసేనకు అవకాశాలు సుస్పష్టంగా వుంటాయి.

Related Posts

ఓడి గెలిచిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌

జంపింగ్‌ జపాంగ్స్‌: జనసేనని ముంచేసింది వీళ్ళే

జనసైనికుడొక్కడే.. వైఎస్‌ జగన్‌ని తట్టుకోగలడా.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...