అక్టోబర్ 5 నుంచి నవంబర్ 20 వరకు 48 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం పోరాటం చేశారు. ఈ సమ్మె సమయంలో ఉద్యోగాలు పోతాయనిగాని, జీతాలు రావని, జీవితాలు కోల్పోతామని తెలిసినా కానీ, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం అన్నింటిని పక్కన పెట్టి సమ్మెబాట పట్టారు. సమ్మె చేయడం తప్పుకాదు.. కానీ, సమ్మె చేసిన కాలమే తప్పు అని ప్రభుత్వం భావించింది.
ప్రభుత్వానికి ఆదాయానికి తీసుకొచ్చే బతుకమ్మ, దసరా సమయంలో సమ్మె చేయడంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది. కోట్లాది రూపాయలు నష్టం వస్తుందని, కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని, సమ్మె చేపట్టిన మొదట్లోనే ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నాయకులను కోరింది. కానీ, కార్మికులు మాత్రం దానికి ససేమిరా చెప్పడంతో.. ప్రభుత్వం మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అప్పుడే కాదు.. 48 రోజుల్లో మూడు సార్లు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ, ఆ మూడుసార్లు కూడా ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తిని కార్మికులు వ్యతిరేకించారు. హైకోర్టు కూడా సమ్మెను చట్ట విరుద్ధం అని చెప్పకపోయినా.. కార్మికుల పక్షాన తీర్పు ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఈ కేసు లేబర్ కోర్టులో ఉన్నది. ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారు. పదుల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
జరిగిన పరిణామాలు అన్నింటిని గమనించిన కార్మికులు 48 రోజుల తరువాత సమ్మెను విరమించారు. ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మికులు చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. మరికాసేపట్లోనే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోబోతున్నది. ఒకవేళ ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదు అని కెసిఆర్ నిర్ణయం తీసుకుంటే.. 50వేల కుటుంబాల పరిస్థితి ఏంటి అన్నది తెలియాలి.
221738 271752Hey, are you having issues with your hosting? I required to refresh the page about million times to get the page to load. Just saying 386639
843906 813595Somebody necessarily support to make seriously articles I may possibly state. That may be the quite initial time I frequented your web page and to this point? I surprised with the research you made to make this actual put up remarkable. Amazing task! 66895
464680 715230Ive applied the valuable points from this page and I can certainly tell that it gives a lot of assistance with my present jobs. I would be extremely pleased to maintain obtaining back in this web page. Thank you. 457319