దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం, డిసెంబర్ నెలలో అర్థరాత్రి ఓ యువతిపై పాశవికంగా దాడి చేశారు నరరూప రాక్షసులు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అది. నర రూప రాక్షసులు, అతి కిరాతకంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ కొద్ది రోజుల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె పేరుని ‘నిర్భయ’గా ప్రకటించడమే కాదు, ఆమె పేరుతో చట్టాన్ని కూడా కేంద్రం తీసుకొచ్చింది.
ఆ నిర్భయ ఘటనలో ఇప్పుడు, ఇన్నాళ్ళకి.. దోషులకు ఉరిశిక్ష అమలయ్యింది. అంతటి దారుణ ఘటన జరిగాక, ఒక్క క్షణం కూడా బతికి వుండడానికి అర్హత లేకపోయినా, ఆ నర రూప రాక్షసులు ఇప్పటికీ బతికే వున్నారు. అది మన న్యాయ వ్యవస్థలోని లొసుగుల వల్ల జరిగిందా.? ఇప్పటికైనా ఉరిశిక్ష పడినందుకు ఆనందించాలా.? అన్న చర్చ పక్కన పెడితే, జరగాల్సింది చాలా వుంది.
ఈ భూమ్మీద నూకలు ఎప్పుడో చెల్లిపోయినా, ఇంకా బతికేస్తున్న చాలామంది రాక్షసులున్నారు. వాళ్ళందరికీ చట్ట ప్రకారం శిక్ష పడి తీరాల్సిందే. కానీ, ఒక్క నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడేందుకే ఇన్నేళ్ళ సమయం పడితే, మిగతా కేసుల పరిస్థితి ఏంటి.? ఇదే ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న. నిర్భయ అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైనా, ఆమె ఒక్కసారే చనిపోయింది. కానీ, నిర్భయ తల్లి, తన కుమార్తెకు న్యాయం జరగాలంటూ.. ఎన్నోసార్లు చచ్చిపోవాల్సి వచ్చింది. అవును, ‘ఇప్పటికైనా న్యాయం జరిగినందుకు ఆనందంగానే వుంది..’ అంటూ ఆమె నిట్టూర్చారంటే, ఆమె నిట్టూర్పు వెనుక బాధని మనమంతా అర్థం చేసుకోవాలి.
ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత కుంటి సాకులు చెబుతూ, ఉరి వాయిదా వేసుకునేలా చేసుకోవడం.. గత కొద్ది రోజులుగా ఈ తంతు నడవడం చూస్తూనే వచ్చాం. నేరస్తుడికి చివరి క్షణం వరకూ అవకాశమివ్వడం మన న్యాయ వ్యవస్థ గొప్పతనం అని సరిపెట్టుకోలేకపోయింది ఆ తల్లి.
అవును, ఆమె మాత్రమే కాదు.. దేశంలో ప్రతి ఒక్క తల్లి పరిస్థితీ ఇదే. ‘ఆ నలుగురినీ’ ఉరి వేస్తే, నిర్భయ తిరిగొస్తుందా.? అని కొందరు ప్రశ్నించొచ్చుగాక. కానీ, ‘ఇలాంటి మానవ మృగాలు మళ్ళీ భూమ్మీద తిరగకూడదు.. తిరిగితే, ఇంకెంతమంది తన కుమార్తెలా బలైపోతారో..’ అని ఆ మాతృమూర్తి భావించింది. పోరాటంలో చాలాసార్లు అలసిపోయినా, ఆమెకు విజయం దక్కింది. ఇది ఓ తల్లి విజయం. కానీ, దేశంలో మానవ మృగమంటూ లేని రోజు రావాల్సిందే.!
109880 24005Satisfying posting. It would appear that a great deal of the stages are depending upon the originality aspect. Its a funny thing about life should you refuse to accept anything but the best, you very often get it. by W. Somerset Maugham.. 52346
297465 843854I discovered your weblog web site site on the search engines and check several of your early posts. Always maintain up the quite excellent operate. I lately additional increase Rss to my MSN News Reader. Looking for toward reading much a lot more on your part later on! 724026
432534 229479very nice put up, i undoubtedly enjoy this web web site, keep on it 896581