మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు చిత్ర యూనిట్. ఇక ఈ చిత్ర ట్రైలర్ మెగా ఫ్యాన్స్ ఆకలిని తీర్చిందని చెప్పాలి. చాలా కాలం తరువాత వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఈ ట్రైలర్‌ను చూసినవారు.
‘‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరేట్టిందే ఆయన్ను చూసి’’ అంటూ వీరయ్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. ఇక ఊరమాస్ అవతారంలో చిరంజీవి లుక్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండబోతుంది. అటు మాస్ రాజా రవితేజ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన నోటివెంట కూడా అదిరిపోయే డైలాగులు పేలాయి. అందాల భామ శ్రుతి హాసన్‌తో బాస్ పులిహోర కలిపే విధానం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. చిరంజీవి చాలా రోజుల తరువాత కామెడీని కూడా ఈ సినిమాలో పండించాడు.
ఇక ట్రైలర్లో అతి ముఖ్యమైనదిగా రవితేజ, చిరంజీవి ఫేస్ టు ఫేస్ డైలాగ్ అని చెప్పాలి. మెగాస్టార్ ఎవర్గ్రీన్ డైలాగ్ ‘‘ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇస్తారా.. బాక్సులు బద్దలవుతాయి..’’ అంటూ రవితేజ మాస్ వార్నింగ్ ఇవ్వగా.. ‘‘ఏంట్రా బద్దలయ్యేది.. సిటీకి ఎంతో మంది కమీషినర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య.. లోకల్’’ అంటూ బాస్ వేసిన పంచ్ సూపర్ అని చెప్పాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ అంశాలతో నింపేసింది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో వాల్తేరు వీరయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
169982 958806Extremely good post, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 405091
374381 736223Superb post but I was wanting to know in the event you could write a litte far more on this subject? Id be very thankful should you could elaborate just a little bit a lot more. Thanks! 940206
353920 45381Hi there, I found your blog via Google while searching for very first aid for a heart attack and your post looks really interesting for me. 997621
153610 540411omg! cant imagine how fast time pass, after August, ber months time already and Setempber will be the initial Christmas season in my location, I actually really like it! 644160