Switch to English

ట్వీట్లు.. బూతులు.! విజయసాయిరెడ్డి అసహనానికి అర్థమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పాలకుల్లో అసహనం దేనికి సంకేతం.? అధికార పక్షం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందనడానికి అది సంకేతం.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘కౌలు రైతు భరోసా యాత్ర’ చేస్తూ, రాజకీయాలు మాట్లాడటమేంటి.? అంటూ వైసీపీ అధికార ప్రతినిథి సుందరరామ శర్మ ఓ న్యూస్ ఛానల్‌లో అమాయకంగా ప్రశ్నించేశారు. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాల్న అమలు చేసే క్రమంలో ఏర్పాటు చేస్తున్న అధికారిక బహిరంగ సభల్లో రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు.?

విపక్షాలు రాజకీయం చేయడం వేరు.. అధికార పక్షం, అధికారికంగా రాజకీయం చేయడం వేరు. నిబద్ధత వుంటే, వైసీపీ అధినేత హోదాలో ఓ రాజకీయ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని, ఆ వేదిక ద్వారా విపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు చేసుకోవచ్చు. కానీ, అధికారిక బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, కేవలం రాజకీయ విమర్శలకు పరిమితమైతే ఎలా.? దీన్నే అసహన రాజకీయం అంటారు.!

ఇక, సోషల్ మీడియా వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ‘మళ్ళీ గెలవలేం..’ అన్న ఆవేదన ఆయన ట్వీట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. చేతనైనంతమేర పార్టీకి ఉత్సాహం తీసుకురావాల్సింది పోయి, పార్టీని చంపేయడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టున్నారు.

‘బోకేష్‌గాడు సన్నబడటంలేదు. సుగర్‌తో ఎండిపోతున్నాడు…’ అంటూ నారా లోకేష్ మీద ఓ ట్వీటేశారు విజయసాయిరెడ్డి. ఇంకో ట్వీటులో, ‘పులి అంటే.. పుచ్చు లింగం అని..’ అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద విమర్శలు చేశారు. అంతేనా, ‘ముసలోడు..’ అంటూ పదే పదే నారా చంద్రబాబునాయుడి మీద విరుచుకుపడుతున్నారు.

రాజకీయాల్లో విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేస్తున్నవి విమర్శలు కావు, అభ్యంతరకర వ్యాఖ్యలు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు. సభ్య సమాజం హర్షించని విషయాలివి. ఆయా వ్యక్తులకు లేని రోగాల్ని అంటగట్టి, దుష్ప్రచారం చేయడం, పెద్దల సభ అయిన రాజ్యసభ సభ్యుడికి తగునా.?

‘ఇంత అసహనంతో ఊగిపోతున్నారంటే, బహుశా ఏదో బలమైన మానసిక సమస్య లేదా శారీరక సమస్య ఏదో విజయసాయిరెడ్డికి వుండి వుండాలి..’ అని జనం అనుమానించే పరిస్థితి వచ్చిందిప్పుడు. అదే అనుమానం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. కానీ, విసారెడ్డి అసహనంతో ఊగిపోతున్నారు. వైసీపీ నిండా మునిగిపోయిన వైనం ఆ పార్టీ అధినేత మాటల్లోనూ, విజయసాయిరెడ్డి ట్వీట్లలోనూ అర్థమవుతోంది. చిత్రమేంటంటే, ఇప్పటికే మునిగిపోయిన టీడీపీకి వైసీపీ ఎందుకు జాకీలేసి పైకి లేపాలని చూస్తుండడం.

7 COMMENTS

  1. 583684 975774Youre so cool! I dont suppose Ive learn something like this before. So nice to search out any person with some distinctive thoughts on this subject. realy thank you for starting this up. this internet internet site is one thing thats required on the net, someone with a bit of originality. beneficial job for bringing something new to the internet! 622914

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....