Switch to English

కూల్చివేతలు.. కోర్టు చీవాట్లు.! ఇదొక నిరంతర ప్రక్రియ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేతనీ, ఆ పార్టీ నాయకుల్నీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ పొలిటీషియన అయిన అయ్యన్న, తన స్థాయిని దిగజార్చుకుని మరీ రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అయితే, మంత్రులే బూతులు మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతలు ఆ స్థాయిలోనే, ఆ మంత్రులకు అర్థమయ్యే భాషలోనే సమాధానమిస్తే తప్పేముంది.? అన్నది వేరే చర్చ.

తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నోనొకటిస్తా.. అని వెనకటికి ఎవడో అన్నాడట. అలా తయారయ్యింది వ్యవహారం. వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు ఇంకా గట్టిగా తిడుతున్నారు. అదీ సంగతి. మధ్యలో అధికారులెందుకు బదనాం అవ్వాలి.? ఔను, అధికారుల్ని ఎందుకు బలిపశువుల్ని చెయ్యాలి.?

‘చంద్రబాబు హయాంలో వ్యవస్థల్ని టీడీపీ వాడుకుంది.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏమీ జరగడంలేదు..’ అన్నట్టుగా వ్యవహరిస్తోంది వైసీపీ. అందుకే కదా, చంద్రబాబు పార్టీని జనం మూలన కూర్చోబెట్టింది.? ఇప్పుడు వైసీపీకి కూడా జనం అదే సన్మానం చేయాలని బహుశా వైసీపీ నేతలు చేస్తున్నారేమో.

అయ్యన్నపాత్రుడ్ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన ఇంటి కూల్చివేతలకు స్కెచ్ వేసింది అధికార పార్టీ. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.? అన్నట్టు, అధికార పార్టీ తలచుకుంటే, చట్టం ఎవరి పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.? ఆగమేఘాల మీద అయ్యన్న ఇంటి వైపుకి జేసీబీలు దూసుకెళ్ళాయి.. కూల్చివేతలు షురూ అయ్యాయి.

తర్వాత కథేంటి.? అన్నది చాలామందికి తెలిసిన విషయమే. అయ్యన్న కోర్టును ఆశ్రయించడం, కోర్టు నుంచి అధికారులకు చీవాట్లు పడటం.. అన్నీ షరామామూలుగానే జరిగిపోయాయి. ఇక్కడ అధికారులే అడ్డంగా బుక్కయిపోయారు. ప్రతిసారీ ఇంతే. విశాఖలో విమానాశ్రయం దగ్గర చంద్రబాబు అడ్డగింత దగ్గరనుంచి చెప్పుకుంటూ పోతే, చాలా కేసుల్లో అధికారులు అడ్డంగా.. అదీ హైకోర్టులో బుక్కయిపోయిన వైనాన్ని చూస్తూనే వున్నాం.

అధికారులు.. అంటే, అధికార పార్టీకి కొమ్ముకాసేవాళ్ళు కాదు మహాప్రభో.. అని ప్రభుత్వోద్యోగులకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.! అప్పట్లో టీడీపీకి, ఇప్పుడు వైసీపీకి.. చెంచాగిరీ చేయడమేనా అధికారుల పని.? అన్న ప్రశ్నలకు ఏ ఉద్యోగ సంఘాలు సమాధానం చెప్పగలుగుతాయి.?

ఈ పద్ధతి మారాలి.! అలా మారాలంటే ముందుగా ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...