కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు మీదున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా విజయ్ ఏ సినిమా చేసినా కూడా వంద కోట్లు మినిమం వస్తూనే ఉన్నాయి. సినిమా టాక్తో సంబంధం లేకుండా విజయ్ సినిమ వందల కోట్లు రాబడుతూనే ఉండటంతో ఆయన సినిమాలు ఏడాదికి రెండు విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన విజయ్ ఈ ఏడాది కూడా రెండు సినిమాలతో వచ్చే ఉద్దేశ్యంతో ఏప్రిల్లో ఒక సినిమాను విడుద చేయానుకున్నాడు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. షూటింగ్ పూర్తి అయ్యింది, సినిమా ఆడియో వేడుక జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది. కాని కరోనా కారణంగా సినిమాను ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కనీసం మూడు నెలలు అయినా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.
మార్చి 31 వరకు కరోనా కారణంగా థియేటర్లను మూసేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయితే ఏప్రిల్ 1 తర్వాత అయినా వెంటనే థియేటర్లకు ఓపెన్ చేస్తారనే నమ్మకం లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా కూడా జనాలు భయంతో ఉన్నారు. కనుక వెంటనే వచ్చే అవకాశం లేదు. ఈ కారణాల వల్లే మాస్టర్ సినిమాను ఏకంగా జూన్ లేదా జులై నెలల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. విజయ్ మరో సినిమా పనిలో పడబోతున్నాడు. విజయ్ తదుపరి చిత్రంగా మురుగదాస్ దర్శకత్వంలో తుపాకి కి సీక్వెల్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
693093 418201Hi there! I just wish to give an enormous thumbs up for the good information youve correct here on this post. I shall be coming once again to your weblog for extra soon. 727925
78292 232124i could only wish that solar panels cost only several hundred dollars, i would enjoy to fill my roof with solar panels- 332631
70654 222913Thanks for some other great post. Exactly where else may possibly just anyone get that type of info in such an ideal means of writing? Ive a presentation next week, and Im at the search for such information. 39002
116099 947751I consider something actually special in this internet site . 445293