సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రాజెక్ట్ రూపొందుతుందని కొన్నేళ్ల కిందటే ప్రకటన వచ్చింది. అయితే ఆ తర్వాత దాని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడింది లేదు. ఒక భాగం అనుకున్న పుష్ప కాస్తా రెండు భాగాలుగా తెరకెక్కడం, పుష్ప 1 హిట్ తర్వాత పుష్ప 2 కు సుకుమార్ బాగా టైమ్ తీసుకోవడం జరిగాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ సాగుతోంది.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఒక ప్యాన్ ఇండియా సినిమాను అటెంప్ట్ చేసాడు. ప్రస్తుతం తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తోన్న ఖుషి అయిపోయాక పరశురామ్ తో, గౌతమ్ తిన్ననూరితో వరసగా సినిమాలు ఉన్నాయి.
మరి ఎవరికి వారే బిజీగా ఉన్న తరుణంలో విజయ్, సుకుమార్ కలిసి సినిమా చేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కచ్చితంగా ఈ ఇద్దరూ పనిచేస్తారట. ఆల్రెడీ ఇద్దరూ అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.