ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన బీస్ట్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సరసన పూజ హెగ్డే నటించింది. డాక్టర్ తో తెలుగులో కూడా విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో చూద్దాం.
కథ:
వీర రాఘవ (విజయ్) దేశంలోకి బెస్ట్ RAW ఏజెంట్. అయితే కొన్ని కారణాల వల్ల ఏజెన్సీకి దూరంగా ఉంటాడు. దీని తర్వాత పూజ హెగ్డేతో విజయ్ కు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీస్తుంది. ఇదిలా ఉండగా విజయ్, పూజ ఒకరోజు మాల్ కు వెళ్లగా అక్కడ అనుకోకుండా టెర్రరిస్ట్ లు ప్రవేశించి, ఉమర్ ఫారూఖ్ అనే టెర్రరిస్ట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. మాల్ లో ఉన్న ప్రజలను బంధిస్తారు.
మరి అదే మాల్ లో ఉన్న RAW ఏజెంట్ వీర రాఘవ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసాడు? దాని పరిణామాలు ఏంటి?
నటీనటులు:
RAW ఏజెంట్ గా విజయ్ సూపర్బ్ గా సెట్ అయ్యాడు. ఈ సినిమాలో విజయ్ స్టైలింగ్ కూడా బాగుంది. తన పెర్ఫార్మన్స్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. చాలా చోట్ల విజయ్ ఇచ్చిన సెటిల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.
పూజ హెగ్డేకు ఈ చిత్రంలో అంతగా ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో పూజ ఆకట్టుకుంది. విజయ్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన హలమితి హబిబో సూపర్ గా ఆన్ స్క్రీన్ పై పేలింది.
సెల్వరాఘవన్ కు ఈ చిత్రంలో కీలక పాత్ర దక్కింది. అతను మెప్పిస్తాడు. యోగి బాబు పర్వాలేదు. మిగతా కమెడియన్లు అక్కడక్కడా నవ్వించడానికి ప్రయత్నించారు.
సాంకేతిక నిపుణులు:
అనిరుధ్ అవుట్ పుట్ మరోసారి మెప్పించింది. హలమితి హబిబో చూడటానికి చాలా బాగుంది. ఆల్రెడీ ఈ పాట బ్లాక్ బస్టర్ అయిన విషయం తెల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్ గా ఉంది. కలర్ఫుల్ అవుట్ పుట్ ఇవ్వడంలో మనోజ్ పరమహంస సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఫైట్స్ కొన్ని బాగున్నా చాలా చోట్ల ఓవర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
టెర్రరిస్ట్ లతో డీలింగ్ అంటే ఎలా ఉండాలి? ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో వచ్చే కంటెంట్ లో ఈ బ్యాక్ డ్రాప్ ను చాలా అథెటిక్ గా చూపిస్తున్నారు. కానీ నెల్సన్ టెర్రరిస్ట్ లు ప్రజలను హాస్టేజ్ గా తీసుకున్న సీరియస్ పరిస్థితిని కూడా చాలా లైట్ వే లో చూపించాడు. ఇక విజయ్ చేసే సాహసాలకు అయితే అంతే లేదు. ఎంత ఫ్యాన్ అయినా కూడా ఒకానొక స్టేజ్ లో ఓవర్ అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతుంది. కిరాతకులైన టెర్రరిస్ట్ లు విజయ్ ముందు చేష్టలుడిగి చూస్తుండి పోతారు.
ఇది కచ్చితంగా దర్శకుడి వైఫల్యమే. మాల్ హైజాక్ ఎపిసోడ్ ను పకడ్బందీగా ప్లాన్ చేసుకుని, మరింత రియలిస్టిక్ వే లో తీసి ఉంటే బీస్ట్ మరో లెవెల్లో ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దురదృష్టవశాత్తూ ఇక్కడ అదే జరగలేదు.
పాజిటివ్ పాయింట్స్:
- విజయ్
- పూజ హెగ్డే
- హలమితి హబిబో
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ
నెగటివ్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- సెకండ్ హాఫ్
- మాల్ ఎపిసోడ్
- ‘ఓవర్’ యాక్షన్
చివరిగా:
ఫ్యాన్స్ కు కూడా యావరేజ్ అనిపించే బీస్ట్, సాధారణ ప్రేక్షకులకు బిలో యావరేజ్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. విజయ్ పెర్ఫార్మన్స్, అక్కడక్కడా పేలే కామెడీ, హలమితి హబిబో సాంగ్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ మనకు పర్వాలేదు అన్న ఫీలింగ్ ను కలిగిస్తే, సెకండ్ హాఫ్ నిరుత్సాహపరుస్తుంది. మొత్తంగా విజయ్ ఫ్యాన్స్ కు మాత్రమే ఇది వన్ టైమ్ వాచ్.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5