Switch to English

తొక్కుకుంటూ పోవాలె: దర్శన ‘భాగ్యం’ కాదది నేరం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

దైవదర్శనం ఓ భాగ్యం.! ఔను, కానీ అదిప్పుడు ఓ వ్యాపారం. మార్కెట్లో వివిధ రకాలైన వస్తువులకు రేట్లు పెట్టి అమ్మేసినట్లు.. హిందువులకు ‘భక్తిని’ అమ్మేస్తున్నారు. పేరులోనే వుంది దేవాదాయ శాఖ అని. దేవ ప్లస్ ఆదాయ.. వెరసి దేవాదాయ.. అన్నమాట.!

ఈ శాఖ ద్వారా వచ్చే ఆదాయం మీద తప్ప, ప్రభుత్వాలకి భక్తుల మీద కాస్తంత కూడా శ్రద్ధ వున్నట్లు కనిపించడంలేదు. నిజానికి, భక్తుల మీద చాలా శ్రద్ధ వుంది.. ఎందుకంటే ఆ భక్తుల్ని బాగా పిండెయ్యాలి కదా.! శ్రద్ధ లేనిదల్లా భక్తుల సెంటిమెంట్ల మీద.

కలియుగ ప్రతక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకుంటే కష్టాలు తొలగుతాయన్నది భక్తుల నమ్మకం. ఆపద మొక్కులవాడనీ.. వడ్డీకాసులవాడనీ.. ఇలా వెంకటేశ్వరస్వామిని కొలుస్తుంటాం. ఇక్కడ కూడా ‘కాసులు’ మాత్రమే ప్రభుత్వాలకి కనిపిస్తున్నాయి.

శీఘ్ర, అతి శీఘ్ర, స్పెషల్, వెరీ వెరీ స్పెషల్.. అంటూ చాలా దేవాలయాల్లో భక్తిని అడ్డగోలుగా అమ్మేస్తున్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మేసుకుంటే అమ్మేసుకున్నారు, భక్తుల్ని తొక్కిసలాటల్లోకి నెట్టేయడమేంటి.? అదే మరి ‘కిక్కు’ అంటే.!

సర్వదర్శన టోకెట్ల కోసం తాజాగా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది.. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకీ టీటీడీ ఏం చేస్తోంది.? అధికార యంత్రాంగం ఏం చేస్తోంది.? ఆ ఒక్కటీ అడక్కూడదు. పాలక మండలి అనగానే, అందులో రాజకీయ నిరుద్యోగులే ఎక్కువగా వుంటారు. సో, వాళ్ళకి భక్తుల కష్టాలు పట్టవ్.!

భక్తులందు వీఐపీ భక్తులు వేరయా.. అన్నట్టు ఆ వీఐపీ భక్తుల సేవలో తరిస్తుంటుంది టీటీడీ. చాలాకాలంగా నడుస్తోన్న తంతు ఇది. ఇదే అన్ని సమస్యలకీ కారణం. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనన్నది పాత మాట. ఆ భక్తులందు వీఐపీ భక్తులు మాత్రమే శ్రీవారికి ప్రీతి.. అన్నట్టు మార్చేసింది టీటీడీ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.....

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: రామ్ చరణ్ వన్ మ్యాన్ షో.. రెండో సినిమాకే రికార్డులు

Ram Charan: చిరంజీవి (Chiranjeevi) వారసుడు అంటే చిరంజీవి పేరు నిలబెట్టాలంతే..! వేరే ఆప్షన్ లేదు. అప్పటికి 28ఏళ్లుగా తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన బలమైన ముద్ర.. సృష్టించిన ప్రభంజనం అటువంటిది. చిరంజీవి...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

ఆపరేషన్ పిఠాపురం: ఒక్కని ఓటమి కోసం.. వంద వ్యూహాలు

ఒక్క పవన్ కళ్యాణ్‌ని ఓడించేందుకు, వైసీపీ అనుసరిస్తున్న వంకర వ్యూహాలు, అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇప్పుడేమో పిఠాపురం.. ఇదో పెద్ద ప్రసహనంగా తయారైంది వైసీపీకి.! ప్రస్తుతానికైతే కుట్రల కేంద్రం పిఠాపురం.!...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...