Venkatesh : టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొదటి సీజన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దాంతో సీజన్ 2 ఉండదేమో అని అంతా అనుకున్నారు.
తాజాగా దర్శకులు సుపర్న్ వర్మ మరియు అన్షుమన్ లు రానా నాయుడు సీజన్ 2 పై ప్రకటన చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని వారు ప్రకటించారు. అంతే కాకుండా మార్చి 5న షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.
రానా నాయుడు 2 వెబ్ సిరీస్ లో వెంకటేష్ మరియు రానా లు నటించబోతున్నారా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో రానా నాయుడు బోల్డ్ సన్నివేశాలు మరియు బూతు డైలాగ్స్ పై ఆ మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. అయినా కూడా నెట్ ఫ్లిక్స్ లో పెద్ద ఎత్తున వ్యూస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.
రానా నాయుడు సీజన్ 2 లో కాస్త బూతు తగ్గించి, బోల్డ్ సన్నివేశాలను తగ్గించే అవకాశాలు ఉంచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రానా మరియు వెంకటేష్ లు మళ్లీ కలిసి నటిస్తే కచ్చితంగా ఫ్యాన్స్ కి కన్నుల విందు అనడంలో సందేహం లేదు.