ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాలను జడ్జ్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్సే. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ కూడా ఎక్కవ. ఇక సక్సెస్ ఫుల్ స్టార్ లను పట్టేసి సినిమాలు తీయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. తాజాగా జెర్సీ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరితో దిల్ రాజు ఓ బిగ్ డీల్ కుదుర్చుకున్నాడట? ప్రస్తుతం ఎక్కడ చుసిన జెర్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఓ గొప్ప ఫీల్ ఉన్న సినిమాగా గౌతమ్ తెరకెక్కించిన తీరుకు ప్రశంశలు దక్కుతున్నాయి.
తాజాగా ఈ దర్శకుడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తో కూడా కథ చర్చలు జరిపాడని అంటున్నారు. తాజాగా దిల్ రాజు కూడా అయన బ్యానర్ లో ఓ సినిమా చేయమని కమిట్మెంట్ తీసుకున్నాడట. ఈ సినిమాలో హీరోగా నటించేది ఎవరో కాదు మెగా హీరో వరుణ్ తేజ్? ఇటీవలే దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఎఫ్ 2లో నటించి మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడట. సో వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేసే సన్నాహాలు అప్పుడే మొదలు పెట్టాడట దిల్ రాజు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. దాంతో పాటు మరో సినిమా చేయనున్నాడు. ఈ మధ్యలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా రాజమౌళి సినిమాకోసం ఈ ఏడాది టైం కేటాయించాడు కాబట్టి అయనతో సినిమాకు టైం పట్టేలా ఉంది. ఈ లోగా వరుణ్ తేజ్ తో గౌతమ్ సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. ఇక జెర్సీ సినిమా తమిళ, హిందీ రీమేక్ హక్కులకోసం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే తమిళంలో లైకా ప్రొడక్షన్స్ ఈహక్కులు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. హిందీ హక్కుల కోసం కరణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
