ఏకంగా ఆరు వరుస పరాజయంతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన ఫేట్ ని మార్చుకునేందుకు న్యూమరాలజీని వాడుకుంటూ ..తన పేరులో ఉన్న ధరమ్ ని పక్కన పెట్టి సాయి తేజ్ గా మార్చుకున్నాడు. ఒక్క పేరే కాదు అటు మేక్ ఓవర్ కూడా మార్చుకుని తాజగా చిత్రలహరి అంటూ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్టందుకున్నాడు. మొత్తానికి చిత్రలహరి తో తనకు కావలసిన హిట్ రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అయన ఇక నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటానని, అనవసర మొహమాటాలకు పోనని చెప్పాడు.
తాజాగా సాయి తేజ్, ప్రముఖ దర్శకుడు మారుతితో సినిమా చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే మారుతి, సాయి తేజ్ మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. కథ నచ్చడంతో సాయి తేజ్ ఒకే చెప్పాడని తెలిసింది. ఇక మారుతికి కూడా ఈ మధ్య సరైన సక్సెస్ లు లేవు. ఈ మద్యే చేసిన శైలజ రెడ్డి అల్లుడు యావరేజ్ గా నిలిచింది. అందుకే మారుతి కూడా సరైన హిట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయట. గతంలో సాయి తేజ్ తో సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేసాడు. చాలా రోజుల తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది. మరి ఈ సారి మారుతి తన సినిమాలో హీరోకు ఎలాంటి ఫోబియా పెడతాడో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే హీరోలకు చిన్న చిన్న లోపాలు పెడుతూ సినిమాలు తీస్తున్నాడు మారుతి. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
