మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej)హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) ల పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న ఈ జంట నవంబర్ 1న ఇటలీలోని టస్కనీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. అనంతరం హైదరాబాద్ లోని మాదాపూర్ పరిసలోని ఒక కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుణ్- లావణ్య పేర్లలోని మొదటి అక్షరాలను సూచించే ‘వి’, ‘ఎల్’ లెటర్స్ తో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు. కార్డు లోపల వరుణ్ నానమ్మ, తాతయ్యల పేర్లను రాశారు. వీరితోపాటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నోబెల్ స్టార్ రామ్ చరణ్ పేర్లను ఇన్విటేషన్ కార్డులో ముద్రించారు.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరుణ్- లావణ్య ఈ ఏడాది జూన్ 9న కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వరుణ్ తాజాగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.