Ugram Movie Review: అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన నాంది… బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఉగ్రం. ఈరోజే విడుదలైన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
శివ (నరేష్) అమ్మాయిలను శారీరికంగా వేధించే నలుగురు జులాయిలను అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ నలుగురు శివ భార్య అపర్ణను సెక్సువల్ గా అబ్యూస్ చేస్తూ హెచ్చరిస్తారు. కోపంతో రగిలిపోయిన శివ వారిలో ముగ్గురిని చంపేయగా ఒకరిని మిస్ చేస్తాడు. తర్వాత తన కుటుంబంతో పాటు శివ కూడా భారీ యాక్సిడెంట్ కు గురవుతాడు. తన భార్య, కూతురు మిస్ అవుతారు.
ఇదంతా చేసింది ఎవరు? గ్యాంగ్ లోని నాలుగో వ్యక్తేనా? తన భార్య, కూతురిని శివ ఎక్కడున్నారో కనుక్కోగలిగాడా? చివరికి ఏమైంది?
నటీనటులు:
కామెడీ చిత్రాలతోనే మనకు సుపరిచితమైన అల్లరి నరేష్ క్లియర్ గా తన రూట్ మార్చుకున్నాడు. నాందితో అలాంటి చిత్రాలు చేసే ధైర్యం నరేష్ కు వచ్చింది. పోలీస్ గా అల్లరి నరేష్ తనను తాను బాగా మార్చుకున్నాడు. తన పాత్ర వరకూ ది బెస్ట్ గా పోషించాడు నరేష్. అయితే ఫస్ట్ హాఫ్ అంతా వాయిస్/మోడ్యులేషన్ పరంగా ఇన్ కన్సిస్టెంట్ గా అనిపించాడు. మిర్ణా మీనన్ పర్వాలేదు.
డాక్టర్ గా ఇంద్రజ బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్ర మేరకు బాగా చేసారు.
సాంకేతిక నిపుణులు:
పోలీసులను ఒక భిన్నమైన యాంగిల్ లో నాందిలో చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల. అయితే ఈసారి తన హీరోనే పోలీస్ గా చూపించాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త పడొచ్చు అనిపించింది. ఇలాంటి సస్పెన్స్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అనేది చాలా ముఖ్యం. మూవీలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. దాంతో ఆడియన్స్ కు డిస్ కనెక్ట్ ఫీలింగ్ వస్తుంది.
సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్:
- సరికొత్త పాత్రలో నరేష్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సస్పెన్స్ ను చివరి వరకూ నిలపాలన్న దర్శకుడి తపన.
మైనస్ పాయింట్స్:
- సస్పెన్స్ ప్లాట్ కు కారణం
- ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్
- బలమైన కథ లేకపోవడం
- ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఏం జరుగుతోందా అన్న సస్పెన్స్ ను నిలిపిన విధానం సెకండ్ హాఫ్ లో మొత్తం వేస్ట్ అయిపోయింది. నరేష్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ గా ఉన్న ఈ చిత్రం పైన చెప్పుకున్న కారణాల వల్ల బిలో యావరేజ్ చిత్రంగా నిలిచిపోతుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5