Switch to English

బాలీవుడ్‌ డ్రగ్స్‌: ఇంతకీ అసలు నిజాలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా సినీ పరిశ్రమలోనూ కొందరు డ్రగ్స్‌ మత్తులో ఊగిపోతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన విషయమేమీ కాదు. చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమే ఇది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ అన్ని సినీ పరిశ్రమల్లోనూ జరుగుతున్నదే. నిజానికి, ఇది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. కాలేజీల్లోనూ డ్రగ్స్‌ మాఫియా తన ‘జోరు’ చూపిస్తున్న వైనం గురించి ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి.

సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు డ్రగ్స్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు.. వాటికి ఎక్స్‌ట్రా క్రేజ్‌ ఏర్పడుతుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. రియా చక్రవర్తి అరెస్ట్‌ తర్వాత, పలువురికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నోటీసులు పంపడం, అందులో రకుల్‌ ఈ రోజు విచారణకు హాజరవడం తెలిసిన విషయాలే. ఎన్‌సిబి అంటే ఆషామాషీ సంస్థ కాదు. అత్యంత పకడ్బందీగా వ్యవహారాలు నడుస్తాయక్కడ. ఏ చిన్న ‘లీక్‌’ కూడా బయటకు వచ్చే పరిస్థితి వుండదు. కానీ, ఇప్పుడెందుకో లీకులు ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ‘పుకార్లు’ నిజమవుతున్నాయి. అలా నిజమవుతున్న పుకార్లతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.

రియా చక్రవర్తి విచారణ సందర్భంగా రకుల్‌ సహా దీపికా పడుకొనే, సారా అలీ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌ పేర్లు తెరపైకొచ్చాయని గాసిప్స్‌ విన్పించాయి.. అవి నిజమయ్యాయి కూడా. ఇప్పుడేమో, విచారణలో రకుల్‌, రియానే డ్రగ్స్‌ సప్లయ్‌ చేసిందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందనే ప్రచారం తెరపైకొచ్చింది. మరోపక్క దీపికా పడుకొనే, ఈ డ్రగ్స్‌కి సంబంధించి వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌గా వున్నారనే ప్రచారం జరుగుతోంది. కొంతమంది టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ గ్రూప్‌లో వున్నారనీ, వారి వివరాలూ రేపో మాపో బయటకొస్తాయనీ అంటున్నారు.

రకుల్‌ సహా పలువురి పేర్లు తాము వెల్లడించలేదనీ, రియా ఎవరి పేర్లూ చెప్పలేదని తొలుత ఎన్సీబీ చెప్పింది. కానీ, అంతలోనే ఆ నలుగురికీ నోటీసులు వెళ్ళాయి. అంటే, డ్రగ్స్‌ కేసుకి సంబంధించి మీడియాకి లీకులు పక్కాగానే అందుతున్నాయన్నమాట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...