Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: పవన్‌ కళ్యాణ్‌, విశాఖకు ‘నై’ అన్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, సినీ నటుడిగా మారాలనుకున్నప్పుడు, నటనలో శిక్షణ తీసుకున్నది విశాఖపట్నంలోనే. విశాఖ అంటే, పవన్‌ కళ్యాణ్‌కి చాలా చాలా ప్రత్యేకమైన అభిమానం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఉత్తరాంధ్ర యాసని తన సినిమాల్లో ఏదో ఒక రూపంలో ఆయన ప్రెజెంట్‌ చేసేవారు. ఉత్తరాంధ్రకు చెందిన జాన పదాలు ఆయన సినిమాల్లో కనిపించేవి. సరే, అదంతా సినిమా వ్యవహారమనుకోండి.. అది వేరే విషయం.

ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంతం కిడ్నీ సమస్యలతో బాధపడుతోంటే, పవన్‌ కళ్యాణ్‌ బాధితుల తరఫున నిలబడ్డారు. ప్రపంచం దృష్టికి ఉద్దానం సమస్యను తీసుకెళ్ళిన ఘనత జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌దే. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఉత్తరాంధ్రలోని విశాఖను రాజధానిగా పవన్‌ వద్దన్నారంటూ వైఎస్సార్సీపీ నేతలతోపాటు, వైసీపీ కట్టు కథల్ని ప్రచారం చేసే బ్లూ మీడియా కొత్త ప్రచారానికి తెరలేపింది.

గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమరావతికి మద్దతు పలికారు. అంటే, అప్పట్లో వైఎస్‌ జగన్‌ కూడా రాజధానిగా విశాఖ వుండకూడదని కోరుకున్నట్లేనా.? రాయలసీమకు అన్యాయం చేయాలని భావించినట్లేనా.? విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. అంటే, కొత్తగా ఏమొస్తాయ్‌.? సెక్రెటేరియట్‌ రావొచ్చు.. కొన్ని ముఖ్యమైన కార్యాలయాలు రావొచ్చు. వాటి ద్వారా విశాఖకు కొత్తగా కలిగే అభివృద్ధి ఏంటట.!

విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. విశాఖకు మెట్రో రాబోతోంది. విశాఖలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతోంది. నౌకాశ్రయం సహా చాలా చాలానే వున్నాయి విశాఖలో. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేసినా, చేయకున్నా.. విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కర్నూలుకి హైకోర్టు వెళ్ళే అవకాశమే లేదని వైసీపీకి తెలిసినా, మూడు రాజధానులంటూ రాయలసీమ ప్రజల్ని ‘జ్యుడీషియల్‌ క్యాపిటల్‌’ అంటూ మభ్యపెడుతోంది. ఈ మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేసే కుట్ర నడుస్తోంది. వీటిని ప్రశ్నిస్తూ, అమరావతికి ఎవరన్నా మద్దతిస్తే.. వాళ్ళంతా ఉత్తరాంధ్ర వ్యతిరేకులు, రాయలసీమ వ్యతిరేకులట. ఏం పైత్యమిది.?

హైద్రాబాద్‌, తెలంగాణకు రాజధాని.. అలాగని మిగతా జిల్లాల్లో అభివృద్ధి జరగకూడదని ఎవరన్నా అడ్డం పెడతారా.? దేశానికి ఢిల్లీ రాజధాని. అంతమాత్రాన, దక్షిణాదిలోనో, ఇంకో భాగంలోనో రాజధాని లేదు కాబట్టి.. దీన్ని కూడా కుట్రగానే భావించాలా.? కనీసపాటి జ్ఞానం కూడా లేనోళ్ళు తప్ప.. ఇలాంటి చెత్త ప్రచారానికి ఎవరూ తెరలేపలేరు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...