కన్నడ బాహుబలి గా ఇమేజ్ తెచ్చుకున్న చిత్రం కెజిఎఫ్. యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క కన్నడంలోనే కాదు తెలుగు,తమిళ , హిందీ భాషల్లో కూడా పెద్ద దుమారమే రేపింది,కన్నడ సినిమా చరిత్రలో కెజిఎఫ్ ఓ మైలు రాయిగా నిలిచిన విషయం విదితమే.
తాజాగా కెజిఎఫ్ మొదటి చాఫ్టర్ సంచలన విజయం అందుకోవడంతో ఇప్పుడు రెండో చాఫ్టర్ మొదలు పెట్టారు. దాదాపు రెండు నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఒక్క అప్ డేట్ కూడా లేదు.. కానీ కెజిఎఫ్ నుండి రేపు ఎదో షాకింగ్ న్యూస్ వస్తుందంటూ ఓ పోస్టర్ ని టీమ్ విడుదల చేసింది.
కెజిఫ్ తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు యాష్, ఇప్పుడు కెజిఎఫ్ కు సంబందించిన ఆసక్తికర విషయం వెల్లడిస్తామని టీమ్ ప్రకటించడంతో సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ న్యూస్ రిలీజ్ కానుంది. ఆ బిగ్ న్యూస్ ఏమిటన్నది అన్న దానిపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరి రేపు సినిమా విడుదల గురించి ప్రకటిస్తారా లేక ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని దసరా సందర్బంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది .. ఎందుకంటే కెజిఎఫ్ చాఫ్టర్ వన్ సమయంలోనే చాలా షూటింగ్ చేసేసారు.. అందుకే సినిమాను రెడీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.. చూద్దాం.. వెయిట్ అండ్ సి !!
793133 246206Wanted posting. Loads of outstanding writing here. I wish I saw it located the web site sooner. Congrats! 964296
401240 16380I was suggested this weblog by way of my cousin. Im no longer positive whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. Youre great! Thanks! 320072