Switch to English

కోడెలపై ‘దొంగతనం’ నిందలో నిజమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌, డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో వున్నారు. అలాంటి ఆయన, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకునేంత హీన స్థితికి దిగజారుతారా.? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ విషయంలో కోడెల శివప్రసాద్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ‘ఆయన చాలా మంచి వ్యక్తి. నిబద్ధత గలిగిన మనిషి. రాజకీయ విమర్శలు వుండొచ్చుగానీ, కోడెలపై దొంగతనం ఆరోపణలు సబబు కాదు..’ అంటూ సొంత పార్టీపైనే గుస్సా అవుతున్నారు రఘురామకృష్ణంరాజు.

మరి, మంత్రి కన్నబాబు ఏకంగా కోడెల శివప్రసాద్‌ని ‘దొంగ’తో పోల్చడమేంటి.? ‘మామూలుగా ఈ పని ఎవరైనా చేస్తే దొంగ.. అంటాం.. మరి, కోడెలను ఏమనాలి.?’ అంటూ కన్నబాబు అనకూడని మాటే అనేశారు. హైద్రాబాద్‌ నుంచి అమరావతికి అసెంబ్లీని తరలించే క్రమంలో, ఫర్నిచర్‌లో కొంత భాగాన్ని కోడెల శివప్రసాద్‌ ఇంటికి తరలించారు. అయితే, కోడెల ఇంటికి.. అంటే, అది కోడెల క్యాంప్‌ కార్యాలయానికి అన్న మాట.

స్పీకర్‌ గనుక, కోడెల శివప్రసాద్‌కి క్యాంప్‌ కార్యాలయం ఒకటి వుంటుంది. అది తన సొంత నియోజకవర్గంలో, తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారాయన. సాధారణంగా ఇలాంటి తరలింపు వ్యవహారాల్లో ఫర్నిచర్‌ వృధా అయిపోతుంటుంది. తుప్పుపట్టిపోతుంటుంది. అలా పాడైపోవడం కంటే, తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారికంగా వినియోగించుకోవాలన్నది కోడెల ఆలోచన. అప్పుడు అధికారులూ అందుకు సమ్మతించారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక, తన వద్దనున్న ఫర్నిచర్‌ని తీసుకెళ్ళాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశారు కోడెల.

సో, ఇక్కడ ఆయన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, స్పీకర్‌ పదవిలో వున్న సీనియర్‌ పొలిటీషియన్‌, ఇలాంటి సమస్య వస్తుందని ముందే ఊహించలేకపోయారా.? ‘దొంగతనం’ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేకపోయారా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అధికారిక పదవుల్లో వున్నవారు పెన్ను, పేపర్‌ సైతం ప్రభుత్వం నుంచే తెచ్చుకుంటుంటారు. అధికారం పోయాక, అన్నిటినీ అప్పగించాల్సిందే. కానీ, కొందరు పదవులు పోయాక కూడా, ‘సౌకర్యాలు’ వదులుకోరు.

కేంద్రం ఇటీవలే, అధికారిక నివాసాలు ఖాళీ చేయాలంటూ మాజీ ఎంపీలకు డెడ్‌లైన్‌ పెట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి తీరాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ‘ఆపరేషన్‌ కోడెల’ చేపట్టింది. కోడెల కుటుంబంపై ముప్పేటదాడి చేస్తోంది. ఈ క్రమంలోనే కోడెల శివప్రసాద్‌ మీద ఇప్పుడు డైరెక్ట్‌ ఎటాక్‌ షురూ అయ్యిందన్నమాట.

అధికార పార్టీ ఎంపీనే, తమ ప్రభుత్వ చర్యల్ని తప్పుపడుతున్నారంటే, కోడెల విషయంలో వైసీపీ వాదన ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. కోడెల కుటుంబ సభ్యులపై చాలా ఆరోపణలున్నాయి. కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని, కోడెల కుటుంబాన్ని దోషిగా చూపే అవకాశం వున్నా, రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతోందంటే.. ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కన్పించడంలేదన్నది మెజార్టీ అభిప్రాయం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...