స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ది ట్రయల్”. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “ది ట్రయల్” చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా దర్శకుడు రామ్ గన్ని రూపొందించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతున్న “ది ట్రయల్” సినిమాను ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర ట్రైలర్ ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – “ది ట్రయల్” మూవీ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంది. థ్రిల్లర్ జానర్ సినిమా ఇది. డైరెక్టర్ రామ్ బాగా కథను డీల్ చేశారని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ నెల 24న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. “ది ట్రయల్” మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.